ETV Bharat / business

విస్ట్రాన్​ ఉపాధ్యక్షుడి తొలగింపు- యాపిల్ మరో షాక్ - విస్ట్రాన్​కు కొత్త ప్రాజెక్టులు ఇచ్చేది లేదు

యాపిల్ సంస్థకు ఐఫోన్లు సరఫరా చేసే విస్ట్రాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక కోలార్ జిల్లాలోని ప్లాంట్​లో కార్మికుల దాడి నేపథ్యంలో.. సంస్థ భారత్ ఉపాధ్యక్షుడిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది విస్ట్రాన్​. ఆ సంస్థ తగిన చర్యలు తీసుకునే వరకు కొత్త ప్రాజెక్టులు ఇవ్వబోమని యాపిల్ ప్రకటించింది.

Wistron VP fired
విస్ట్రాన్ ఉపాధ్యక్షుడి తొలగింపు
author img

By

Published : Dec 19, 2020, 4:51 PM IST

యాపిల్ ఐఫోన్ల సరఫరా సంస్థ విస్ట్రాన్ భారత్​ కార్యకలాపాల ఉపాధ్యక్షుడిని బాధ్యతల నుంచి తప్పించినట్లు శనివారం ప్రకటించింది. కర్ణాటక కోలార్ జిల్లా విస్ట్రాన్ ప్లాంట్​లో ఈ నెల 12న జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

'మా బృందాల భద్రత, శ్రేయస్సుకే ఎప్పుడూ మా ప్రథమ ప్రాధాన్యం. ఇవే కంపెనీ ముఖ్యమైన విలువలు' అని విస్ట్రాన్​ పేర్కొంది.

ఇటీవల ప్లాంట్​లో జరిగిన ఘటన దురదృష్టకరమని వెల్లడించింది విస్ట్రాన్​. ఈ ఘటన ద్వారా కొంత మంది కార్మికులకు వేతనాలు అందలేదని, మరికొంత మందికి సరైన సమయానికి వేతనాలు రాలేదని గ్రహించినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తమ కార్మికులందరికీ క్షమాపణలు చెప్పింది విస్ట్రాన్.

అప్పటి వరకు కొత్త ప్రాజెక్టులు ఉండవ్​..

ఇదిలా ఉండగా.. విస్ట్రాన్​కు యాపిల్ షాకిచ్చింది. ప్లాంట్​లో కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు, సమయపాలన పాటించడం లేదని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. దీనితో తమ నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది. ఈ పొరపాట్లన్నింటికీ దిద్దుబాటు చర్యలు తీసుకునే వరకు తమ నుంచి కొత్తగా ఎలాంటి ప్రాజెక్ట్​లు పొందదని విస్ట్రాన్​కు స్పష్టం చేసింది యాపిల్. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:'కార్మికుల దాడితో విస్ట్రాన్​కు రూ.437 కోట్ల నష్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.