భారీ అప్పుల్లో చిక్కుకున్న రిలయన్స్ కమ్యునికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఫైలింగ్‌లో పేర్కొంది.
అనిల్ అంబానీతో పాటు.. ఇతర డైరెక్టర్లు ఛాయా వీరణి, రీనా కరణి, మంజరీ కాకర్, సురేశ్ రంగాచర్లు రాజీనామా చేసినట్లు ఆర్‌కామ్ వెల్లడించింది.
ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్న ఆర్‌కామ్.. 2019-20 రెండో త్రైమాసికంలో.. రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బకాయిలు చెల్లించలేని కారణంగా అ సంస్థ ఇప్పటికే తన మొబైల్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: ఈ 10 అంశాలపై గూగుల్‌లో అస్సలు వెతకొద్దు..!