అబుదాబి జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ 2020లో 1.7 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు గురువారం ప్రకటించింది. కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్న ఎదుర్కొంటున్న సంస్థకు, కరోనా సంక్షోభం తోడవ్వడం వల్ల ఈ స్థాయి నష్టాలు నమోదైనట్లు తెలుస్తోంది.
2019తో పోలిస్తే గత ఏడాది సంస్థ ఆదాయం 5.6 బిలియన్ డాలర్ల నుంచి 2.7 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ వెల్లడించింది.
2016 నుంచి ఎతిహాద్ 5.62 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఐరోపా నుంచి ఆసియా వరకు స్థానిక విమానయాన సంస్థలకు పోటీ ఇవ్వడమే (ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్లకు పోటీ ఇచ్చేందుకు) లక్ష్యంగా దూకుడుగా ఇతర విమాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఇందుకు ప్రధాన కారణం.
2020లో సంస్థ పరిస్థితి..
- కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో ప్యాసింజర్ ట్రాఫిక్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 17.5 మిలియన్ల నుంచి 4.2 మిలియన్లకు తగ్గింది.
- 2020 ప్రథమార్ధంలో ప్యాసింజర్ కెపాసిటీ 64 శాతం తగ్గింది. దీనితో మొదటి ఆరు నెలల్లో సంస్థ 758 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది.
- నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థ సిబ్బందిలో 33 శాతం తగ్గించుకుంది. మిగతా సిబ్బంది వేతనాల్లోనూ 25-50 శాతం వరకు కోత విధించింది. అయినప్పటికీ భారీ నష్టాల నుంచి తప్పించుకోలేకపోయింది.
- ఎతిహాద్ సంస్థ 2019లో 870 మిలియన్ డాలర్లు, 2018లో 1.28 బిలియన్ డాలర్లు, 2017లో 1.52 బిలియన్ డాలర్ల నష్టాలన్ని నమోదు చేసింది.
ఇదీ చదవండి:ఆటో రిక్షాతో 'మొబైల్ హౌస్'.. మహీంద్రా ఫిదా