ETV Bharat / business

ఎస్​ బ్యాంక్ దూకుడు- 50 శాతం పెరిగిన షేర్లు

ఎస్​ బ్యాంక్​ షేర్లు నేడు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఆర్బీఐ మారటోరియం ఎత్తివేయనున్న నేపథ్యంలో ఎస్​ బ్యాంక్ షేర్లకు కొత్త ఉత్సాహం వచ్చింది.

yes bank rally
ఎస్​ బ్యాంక్​కు కొత్త ఉత్సాహం
author img

By

Published : Mar 18, 2020, 3:02 PM IST

సంక్షోభంలో చిక్కుకున్న ఎస్​ బ్యాంక్​పై నేటి సాయంత్రం నుంచి మారటోరియం ఎత్తివేయనుంది భారతీయ రిజర్వు బ్యాంకు. ఎస్​బీఐ సహా పలు ప్రైవేటు బ్యాంకులు ఎస్​ బ్యాంక్​ పునరుద్ధరణ బాధ్యతను భుజాన వేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ.

మారటోరియం ఎత్తేసిన తర్వాత నేటి సాయంత్రం నుంచి సేవలు యథావిధిగా కొనసాగనున్నట్లు ఎస్​ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎస్​ బ్యాంక్​ షేర్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి.

బీఎస్​ఈలో సంస్థ షేర్లు నేడు ఏకంగా 49.95 శాతం పెరిగాయి. దీంతో ఒక షేరు ధర రూ.87.95 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈలోనూ 48.84 శాతం పెరిగిన షేరు విలువ ప్రస్తుతం రూ.87.30 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:'భారత వృద్ధి రేటు ఈ ఏడాది 5.2 శాతమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.