ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి మరో సరికొత్త ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. ట్రిపుల్ ఫోల్డింగ్ డివైసెస్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించిన ఈ సంస్థ.. స్లైడింగ్ డిస్ప్లే ఫోన్‌ను తీసుకురానుందని సమాచారం.
స్లైడింగ్ డిస్ప్లే అంటే..
ఫోన్ అంటే ఒక వైపు మాత్రమే స్క్రీన్ మరో వైపు ఖాళీగా ఉంటుంది. కానీ, ఈ స్లైడింగ్ స్క్రీన్ ఫోన్లలో రెండు వైపులా తెరలు ఉంటాయి. ఒప్పో, ఎల్జీ వంటి దిగ్గజ మొబైల్ తయారీ సంస్థలు ఇదివరకే ఇలాంటి ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించాయి. 'ఎంఐ మిక్స్ లైన్అప్' పేరుతో షావోమి కూడా ఈ ఏడాదిలోనే ఈ తరహా డిస్ప్లే ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డచ్‌కు చెందిన 'లెట్స్ గో డిజిటల్' అనే వెబ్సైట్ తెలిపింది.
స్లైడింగ్ డిస్ప్లే వాయిస్‌తోనూ..
స్క్రీన్ మీద ఫ్రంట్ కెమెరా కనబడకపోయినా.. అవసరమైనప్పుడే వాడుకునేలా ఎంఐ మిక్స్ లైన్అప్ అందుబాటులోకి రానుంది. అలాగే.. ఈ డిస్ప్లేను వాయిస్ కమాండ్ల ద్వారా కూడా నియంత్రించవచ్చని 'లెట్స్ గో డిజిటల్' వెబ్సైట్ కథనం చెబుతోంది.
రెండు రకాలుగా..
ఈ స్లైడింగ్ డిస్ప్లేతో రెండు రకాల ఫోన్లను షావోమి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి మొదలుకుని.. వెనకాల ఉన్న కెమెరా వరకు నిలువుగా స్క్రీన్ కొనసాగే రకం ఒకటి. అలాగే.. అడ్డంగా స్క్రీన్ కొనసాగేలా మరో రకం ఫోన్.
ఇదే.. ఎంఐ మిక్స్ సిరీస్‌లో ఎంఐ మిక్స్3, ఎంఐ మిక్స్4 ఫోన్లను కూడా షావోమి త్వరలోనే విడుదల చేయనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:అదిరే ఫీచర్లతో షావోమి ఎంఐ11 ప్రొ!