ETV Bharat / business

కరోనాకు ఆరోగ్య బీమా వర్తిస్తుందా? పాలసీ​ ఎలా ఉండాలి? - వ్యాపార వార్తలు

ఈ రోజుల్లో ఆరోగ్య సమస్య వచ్చిందంటే డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అయితే ఖర్చు భారం మనపై పడకుండా ఉన్న మార్గమే ఆరోగ్య బీమా. ఇప్పుడు కొత్తగా కరోనావైరస్ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకు బీమా వర్తిస్తుందా? కరోనాకు వర్తించే బీమా ఎలా ఎంపిక చేసుకోవాలి? అనే సందేహాలు మొదలయ్యాయి. వాటన్నింటికీ నిపుణుల సలహాలు, సూచనలు మీ కోసం.

insurance for Coronavirus
కరోనావైరస్​కు బీమా వర్తిస్తుందా
author img

By

Published : Mar 22, 2020, 9:46 AM IST

కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ మహమ్మారి గురించే.. ప్రపంచమంతా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని సృష్టించిన ఈ వైరస్‌కన్నా ముందు అనేక కొత్త కొత్త వ్యాధులు మనల్ని చుట్టుముట్టాయి. వాటన్నింటికీ చికిత్స దొరికేదాకా ఆందోళన చెందాం. ఒకదాని తర్వాత ఒకటిగా వైరస్‌లు వస్తూనే ఉంటున్నాయి... వాటికి వైద్య శాస్త్రం సరైన పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ.. వీటి బారిన పడితే... చికిత్స కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే పెద్ద చిక్కు ప్రశ్న. ఇప్పటికే మనం తీసుకున్న ఆరోగ్య బీమా.. ఈ కొత్త చికిత్సలకు వర్తిస్తుందా? ఇప్పుడు సందేహించే బదులు.. బీమా తీసుకునేటప్పుడే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ పరిహారం ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వైద్య ఖర్చులు ఎప్పటకప్పుడు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సంపూర్ణ ఆరోగ్య బీమా పాలసీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అనుకోని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే దాచుకున్న డబ్బులన్నీ ధారపోయాల్సిన పరిస్థితి. ఆరోగ్య బీమా పాలసీ ప్రాధాన్యం గురించి తెలుసుకోవడం మాత్రమే సరిపోదిప్పుడు. మన ప్రతి అవసరంలోనూ అది ఆదుకుంటుందా లేదా అనేదీ చూసుకోవాలి. ఇప్పటికీ కరోనాలాంటి వైరస్‌లు వచ్చినప్పుడు అనేక పాలసీలు దానికి పరిహారం లభించదు అన్నట్లుగానే ఉంటున్నాయి. వీటన్నింటినీ మనం మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం ఏదైనా సరే.. పాలసీ ఉందంటే రక్షణ ఉండాలి అనే ధీమా కల్పించే వాటినే మనం ఎంచుకోవాలి.

బృంద బీమా ఉన్నా..

మనకు ఏం కావాలి? ఎలాంటి అవసరాలు ఉంటాయి? ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రాథమికంగా సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్నలివే. ఇప్పటికే ఉన్న వ్యాధులు, కొత్తగా ముంచుకొచ్చే వైరస్‌లు.. అన్నింటికీ ఇది పరిహారం అందించేలా ఉండాలి. చాలామంది తమ యాజమాన్యాలు అందించే బృంద ఆరోగ్య బీమా పాలసీలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. కానీ, ఇది సరిపోతుందా? అనేది పెద్ద ప్రశ్నే. బృంద ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పటికీ సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం అవసరం. కనీసం సూపర్‌ టాపప్‌ పాలసీనైనా ఎంచుకోవాలి. సరైన మొత్తానికి పాలసీ లేకపోతే.. తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమేనని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీకు పాలసీ ఎంపికలో అనుమానాలుంటే.. మీ బీమా సలహాదారుడు లేదా బీమా కంపెనీ వినియోగదారుల సహాయ కేంద్రాన్ని సంప్రదించండి. అవసరానికి ఆదుకునేలా పాలసీ తీసుకోవడమే మన లక్ష్యం కావాలి.

నిబంధనలు తెలుసుకోండి..

వేటికి పరిహారం వర్తిస్తుంది.. వేటికి వర్తించదు అనే నిబంధనలు ఆరోగ్య బీమా పాలసీలో సహజంగానే ఉంటాయి. కొన్నింటికి వేచి ఉండే కాలం ఉంటుంది. ముందస్తు వ్యాధుల విషయంలో పూర్తిగా మినహాయింపు అని చెబుతుంటాయి. గదుల అద్దె, శస్త్ర చికిత్సల విషయంలోనూ, ఓపీడీలాంటి వాటికి పరిమితులు, ఉప పరిమితులు ఉంటాయి. మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ నిబంధనలన్నీ స్పష్టంగా తెలుసుకోండి. వీటి గురించి అవగాహన లేకపోతే.. పాలసీని క్లెయిం చేసుకునే సందర్భంలో మన జేబుపై భారం పడుతుంది. ఆసుపత్రిలో చేరినప్పుడు.. కొర్రీలు పెట్టకుండా.. అన్నింటికీ పరిహారం ఇచ్చే పాలసీకే ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా కరోనాలాంటి అనుకోని వ్యాధులు వచ్చినా.. కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఉన్న పాలసీనే దానికి రక్షణ కల్పించాలి.

వీటితో పాటు..

కొన్ని పాలసీలు.. ఉచిత ఆరోగ్య పరీక్షలకు అనుమతినిస్తాయి. ఏటా ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకునేందుకు వీలవుతుంది. మీరు తీసుకున్న పాలసీలో ఇది ఉందా లేదా తెలుసుకోండి. ఉంటే.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.

పాలసీని క్లెయిం చేసుకోకపోతే.. బోనస్‌ లభిస్తుంది. మీకు పాలసీ ఎంత బోనస్‌ ఇస్తుందనేది బీమా పత్రం మీద పేర్కొంటారు. దీన్ని జాగ్రత్తగా గమనించండి. పాలసీ మొత్తం పెరగడం లేదా ప్రీమియంలో రాయితీ.. ఈ రెండింటిలో ఏది కల్పిస్తున్నారో తెలుసుకోండి.

- గురుదీప్‌ సింగ్‌ బత్రా, హెడ్‌, రిటైల్‌ అండర్‌ రైటింగ్‌, బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

తనిఖీ చేయండి..

మీరు బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్న సంస్థ చరిత్రను ఒకసారి పరిశీలించండి. సంస్థ ఇస్తున్న పరిహారం పద్ధతి, వారి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల గురించి ఆరా తీయండి. వీలైనన్ని కంపెనీల పాలసీల గురించి తెలుసుకోండి. వారు అందిస్తున్న ఆఫర్లు, సేవలు, ఆసుపత్రులలో వాటికి ఉన్న ప్రాధాన్యంలాంటివి చూడండి. ఆ తర్వాతే పాలసీని ఎంపిక చేసుకోండి. కేవలం ప్రీమియం తక్కువగా ఉందని ఆరోగ్య బీమా పాలసీని ఎంపిక చేసుకోవడం మంచిది కాదు.

ఉన్న పాలసీ చాలు..

  • ప్రస్తుతం మేము తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ.. కరోనా వైరస్‌ చికిత్సకు వర్తిస్తుందా?

చాలామంది తమ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న సంస్థలను అడుగుతున్న ప్రశ్న ఇదే. కరోనా వైరస్‌ అనేది ముందస్తు వ్యాధి విభాగంలోకి రాదు. అనుకోని పరిస్థితుల్లో దీని బారిన పడి, ఆసుపత్రిలో చేరితే.. మీకు ఇప్పటి వరకూ ఉన్న ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ.. ఆ చికిత్సకు అయిన ఖర్చును చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇతర అనారోగ్య పరిస్థితుల్లో ఎలా క్లెయిం చేసుకుంటారో.. దీనికీ అదే పద్ధతి వర్తిస్తుంది. పాలసీ నియమ నిబంధనలను బట్టి, ఆసుపత్రిలో క్యాష్‌లెస్‌ చికిత్సకు లేదా.. అయిన ఖర్చులను తిరిగి చెల్లించే విధంగా రీఇంబర్స్‌మెంట్‌ను క్లెయిం చేసుకునే వీలుంటుంది.

ప్రయాణ బీమా పాలసీ విషయంలో మాత్రం దీనికి కొంత భిన్నంగా ఉంది. కరోనాకు పాలసీ వర్తిస్తుందా లేదా అనేది బీమా సంస్థలను బట్టి మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అంటువ్యాధిగా ప్రకటించడంవల్ల ప్రయాణ బీమా పాలసీల్లోని నిబంధనల ప్రకారం.. కరోనా వైరస్‌ వల్ల సంభవించిన ప్రత్యక్ష, పరోక్ష నష్టాలకు పరిహారం ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. కొన్ని పాలసీలు.. ప్రయాణంలోనే ఈ వైరస్‌ అంటుకున్న సందర్భాల్లో పరిహారం ఇచ్చేందుకు వీలున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కరోనా ప్రభావిత దేశాలకు వెళ్లేవారికి ప్రయాణ బీమాను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అన్ని వివరాలూ తెలుసుకున్నాకే ప్రయాణ బీమా పాలసీని ఎంచుకోవడం మంచిది.

- సంజయ్‌ దత్తా, చీఫ్‌, క్లెయిమ్స్‌ అండ్‌ రీ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జీఐసీ

ఇదీ చూడండి:గుడ్లు, చికెన్‌తో కరోనా వ్యాపించదు..అవన్నీ అపోహాలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.