వాట్సాప్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 2019లో ప్లేస్టోర్ నుంచి 5 బిలియన్ డౌన్లోడ్స్ సాధించి.. ఈ మైలురాయిని చేరుకున్న గూగుల్ యేతర రెండో యాప్‌గా నిలిచింది.
స్టాటిస్టా ప్రకారం... నెలవారీ క్రియాశీల వినియోగదారులు కలిగిన ఉన్న మొబైల్ మెసెంజర్ యాప్‌లలో 1.6 మిలియన్ల యూజర్స్‌తో వాట్సాప్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. 1.3 మిలియన్ వినియోగదారులతో ఫేస్బుక్ రెండో స్థానంలో, 1.1 బిలియన్ వినియోగదారులతో వీ-చాట్ మూడో స్థానంలో ఉన్నాయి.
మొత్తంగా చూసుకుంటే... ఫేస్బుక్, యూట్యూబ్ తరువాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందుతున్నది వాట్సాప్ మాత్రమే.
దక్షిణా కొరియాలో
గూగుల్ ప్లేస్టోర్ విషయానికి వస్తే... దక్షిణ కొరియాలో వాట్సాప్ దూసుకుపోతోంది. 2019లో ఇక్కడ దాదాపు 56 శాతం డౌన్లోడ్స్ను వాట్సాప్ సాధించింది.
ఫేస్బుక్.. మొదటిసారిగా
గత ఐదేళ్లుగా అగ్రశ్రేణి మొబైల్ యాప్ ప్రచురణకర్తగా ఉన్న ఫేస్‌బుక్‌ను మొదటిసారిగా గూగుల్ పక్కకునెట్టింది. సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం 2019 చివరి త్రైమాసికంగా గూగుల్ 850 మిలియన్ డౌన్లోడ్స్ సాధించగా, ఫేస్బుక్ మాత్రం 800 మిలియన్ డౌన్లోడ్స్కే పరిమితమైంది.
గత 12 మాసాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఫేస్బుక్ 3 బిలియన్ డౌన్‌లోడ్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో గూగుల్ 2.3 బిలియన్ డౌన్లోడ్స్ మాత్రమే సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్లు ఫేస్బుక్వే కావడం గమనార్హం. అయితే చైనా సామాజిక మాధ్యమం టిక్‌టాక్ రెండో స్థానానికి దూసుకురావడం విశేషం.
ఇదీ చూడండి: స్థిరాస్తి ధరల వృద్ధిలో వరల్డ్ నెం.14గా హైదరాబాద్