ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్-ఐడియా.. 5జీ ట్రయల్స్‌పై కీలక ప్రకటన చేసింది(5g trials in india latest news). 3.7జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్టు వెల్లడించింది(vi 5g trial speed). దేశంలో 5జీపై ఇప్పటివరకు వివిధ టెలికాం ఆపరేటర్లు చేపట్టిన ట్రయల్స్‌లో అత్యధిక వేగం ఇదే కావడం విశేషం. డౌన్లోడ్ స్పీడ్ 1.5జీబీపీఎస్‌గా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది.
గాంధీనగర్, పుణెలో ఈ ట్రయల్స్ జరిగాయి. 5జీ ట్రయల్స్ కోసం.. 26 గిగాహెర్జ్ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్, 3.5జీహెచ్‌జెడ్ స్పెక్ట్రం బ్యాండ్‌ను వొడాఫోన్-ఐడియాకు కేటాయించింది టెలికాం విభాగం డాట్.
5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్‌తో ప్రయోగాలు చేసేందుకు రిలయన్స్ జియో(jio 5g trial), భారతీ ఎయిర్టెల్(airtel 5g speed), వొడాఫోన్-ఐడియాకు మే నెలలో అనుమతులిచ్చింది డాట్. కాగా.. 1జీబీపీఎస్ వేగాన్ని నమోదు చేసినట్టు జియో జూన్‌లో వెల్లడించింది. ఎయిర్టెల్ ట్రయల్స్‌లో కూడా అంతే వేగం నమోదైనట్టు జులైలో తేలింది.
అన్ని ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధారిత బీఎస్ఎన్ఎల్.. 4జీని ఇంకా ప్రవేశపెట్టలేదు.
ఇవీ చూడండి:-