ETV Bharat / business

విదేశాల్లోనూ 'వివాద్​ సే విశ్వాస్​' సేవలు

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన 'వివాద్​ సే విశ్వాస్' పథకం విదేశాల్లోని వివాదం కేసులను పరిష్కరిస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విదేశాల్లోని పన్ను చెల్లింపుదారులు, పన్ను స్వీకరణదారులకు మధ్య వివాదాలను పరిష్కరిస్తుందని స్పష్టం చేసింది.

VIVAD SE VISWAS
వివాద్ సే విశ్వాస్
author img

By

Published : Feb 22, 2020, 8:19 PM IST

Updated : Mar 2, 2020, 5:22 AM IST

పన్ను ఆధారిత సమస్యల పరిష్కారానికి 'వివాద్ సే విశ్వాస్​' పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిద్వారా పన్ను చెల్లింపుదారులు, స్వీకరణదారుల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. ఈ పథకం పరిధిలోకి విదేశాల్లో వివాదం కేసులూ వస్తాయని ఆదాయపన్ను శాఖ తెలిపింది.

ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి ఈ పథకం సువర్ణావకాశం వంటిదని ఐటీ శాఖ వెల్లడించింది. జనవరి 31 లేదా అంతకన్నా ముందు దాఖలైన పిటిషన్లు, రిట్‌లు ఈ పథకానికి అర్హమైనవని ఐటీ శాఖ తెలిపింది. ఇప్పటికే చెల్లించిన పన్నులకు సంబంధించిన వివాదాలు కూడా దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేసింది.

పన్నులు, పెనాల్టీలు, వడ్డీ ఫీజులు, టీడీఎస్‌, టీసీఎస్‌ వివాదాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 'వివాద్‌ సే విశ్వాస్‌' పథకాన్ని ప్రకటించారు.

Last Updated : Mar 2, 2020, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.