ETV Bharat / business

కేంద్రం కొత్త రూల్స్- ఇక వాహనాలకూ నామినీ! - నామినీ ఎంపిక చేసుకునేలా వాహన రిజిస్ట్రేషన్​లో వెసులుబాటు

మోటార్ వాహనాల యాజమాన్యానికి సంబంధించి కేంద్రం సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మరణానంతరం వాహన యాజమాన్య హక్కుల బదిలీకి నామినీని ఎంచుకునేలా.. వెహికిల్​ చట్టంలో సవరణలు చేసింది. ఈ కొత్త రూల్స్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Changes in motor vehicle rules
మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు
author img

By

Published : May 2, 2021, 12:42 PM IST

'మోటార్ వాహనాల నిబంధనలు-1989' చట్టంలో కేంద్రం కీలక సవరణలను నోటిఫై చేసింది. వాహన యాజమానులు నామినీని ఎంచుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. దీనితో ఏదైనా కారణం వల్ల యాజమాని మరణిస్తే.. ఆ వాహన రిజిస్ట్రేషన్​ నామినీకి బదలాయింపు అవనుంది.

వాహనం రిజిస్ట్రేషన్​ సమయంలోనే యాజమాని.. నేరుగా నామినీ పేరును నమోదు చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అనంతరం ఆన్​లైన్​లో కూడా ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం నామినీకి సంబంధించిన గుర్తింపు ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా వేరువేరుగా ఉంటుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇతర వివరాలు..

  • యాజమాని మరణానంతరం నామినీకి హక్కుల బదలాయింపు ప్రక్రియకు మూడు నెలల వరకు సమయం పట్టొచ్చు.
  • యాజమాని మరణించిన 30 రోజుల్లోపు నామినీ సంబంధిత అధికారులను.. రిజిస్ట్రేషన్​ ధ్రువపత్రాలతో సంప్రదించాల్సి ఉంటుంది.
  • విడాకులు, ఆస్తి పంపకాల వంటి కారణాలతో వాహన యాజమాని నామినీని మార్చుకునే వీలుంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్​ఓపీ)ను అంగీకరించి నామినీని మార్చుకోవచ్చు.

ఇదీ చదవండి:కారుకు మళ్లీ 'కరోనా' బ్రేకులు- తగ్గిన విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.