ETV Bharat / business

భారత వాణిజ్య భాగస్వామ్యంలో మళ్లీ అమెరికానే టాప్!​ - commerce ministry latest news

భారత్​-అమెరికాల మధ్య వాణిజ్యం సరికొత్త శిఖరాలను తాకుతోంది. వరుసగా రెండో ఏడాదిలోనూ భారత వాణిజ్య భాగస్వామ్యంలో అమెరికానే తొలిస్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 88.75 బిలియన్​ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో చైనాతో వాణిజ్యం తగ్గినట్లు తేలింది.

US remains India's top trading partner in 2019-20
భారత వాణిజ్య భాగస్వామ్యంలో మళ్లీ అమెరికానే టాప్!​
author img

By

Published : Jul 12, 2020, 10:24 PM IST

భారత వాణిజ్య భాగస్వామ్యంలో వరుసగా రెండో ఏడాది (2019-20)లోనూ అగ్రరాజ్యం అమెరికానే తొలిస్థానంలో నిలిచింది. ఇది భారత్​-అమెరికా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయనేందుకు నిదర్శనం.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది. భారత్​, అమెరికాల మధ్య వాణిజ్యం 2018-19 (87.96 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 2019-20 ఆర్థిక ఏడాదిలో 88.75 బిలియన్​ డాలర్లకు పెరిగింది.

భారత వాణిజ్యంలో మిగులు కలిగిన దేశాల జాబితాలో అమెరికా ఒకటి. ఇరు దేశాల వాణిజ్య అంతరం 2018-19 (16.86 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 2019-20లో 17.42 బిలియన్​ డాలర్లుకు చేరింది.

2018-19 ఆర్థిక ఏడాదిలో చైనాను వెనక్కి నెట్టి భారత వాణిజ్య భాగస్వామ్యంలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది అమెరికా.

చైనాతో తగ్గుదల..

భారత్​, చైనాల మధ్య వాణిజ్యం 2018-19 (87.08బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 2019-20లో 81.87 బిలియన్​ డాలర్లకు తగ్గింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 2018-19(53.57 బిలియన్​ డాలర్ల)తో పోలిస్తే.. 48.66 బిలియన్​ డాలర్లకు తగ్గింది.

భారత్​తో వాణిజ్య భాగస్వామ్యంలో 2013-14 నుంచి 2017-18 ఆర్థిక ఏడాది వరకు చైనానే అగ్రస్థానంలో కొనసాగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంతకు ముందు ఆ స్థానంలో యూఏఈ ఉండేది.

సంప్రదాయం కొనసాగింపు...

అమెరికా-భారత్​ల మధ్య వాణిజ్య భాగస్వామ్యం బలోపేతానికి ఇరు దేశాలు కృషి చేస్తున్న నేపథ్యంలో.. వాణిజ్య విస్తరణ వచ్చే సంవత్సరాల్లోనూ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని భారతీయులు కూడా ఇందుకు ఒక కారణంగా పేర్కొన్నారు జేఎన్​టీయూలోని ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్​ బిస్వజిత్​ ధార్​.

" అమెరికాలో ఎక్కువ శాతం భారతీయులు ఉండటం దేశీయ వస్తువులకు డిమాండ్​ను పెంచుతోంది. వాటిని మనం సరఫరా చేస్తున్నాం. సమతుల్య వాణిజ్య ఒప్పందం ఆర్థిక సంబంధాలనూ మరింత మెరుగుపరుస్తుంది."

- బిస్వజిత్​ ధార్​, జేఎన్​టీయూ ప్రొఫెసర్​.

చైనా వ్యతిరేక భావనలతో..

భారత్​ సహా అమెరికాలోనూ చైనా వ్యతిరేక భావన పెరగటం వల్ల భారత్​-అమెరికాల మధ్య ధ్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి మరింత ఆస్కారం లభిస్తోందని అభిప్రాయపడ్డారు లుథియానా ఆధారిత చేతి వృత్తుల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్​ చందర్​ రల్హాన్​. అమెరికా కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్​ వంటి దేశాలవైపు చూస్తున్నాయని, అదే జరిగితే అమెరికాకు ఎగుమతులు పెంచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.

పన్ను మినహాయింపులపై..

అమెరికా వీసా నిబంధనల్లో సడలింపులు, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అధిక పన్నులను తగ్గించటం సహా వ్యవసాయ, ఆటోమొబైల్​, ఇంజినీరింగ్​ ఉత్పత్తులకు మార్కెట్​ కల్పించాలని కోరుతోంది భారత్​..

మరోవైపు.. తమ వ్యవసాయ, తయారీ ఉత్పత్తులు, డైరీ వస్తువులు, మెడికల్​ పరికరాలకు విస్తృతమైన మార్కెట్​ కల్పించటంతో పాటు సమాచార, సాంకేతిక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతోంది అమెరికా.

ఇదీ చూడండి: కరోనాతో మారిన లెక్క- సర్కారీ కొలువే శ్రీరామ రక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.