Twitter Trends in 2021 in India: దేశంలో కరోనా రెండో దశ విధ్వంసం సృష్టించింది. ఈ సమయంలోనే భారత్ సహా ప్రపంచమంతా మనకు అండగా నిలిచింది. అప్పుడే ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్.. యూనిసెఫ్ ఆస్ట్రేలియా ద్వారా 50 వేల డాలర్లు(రూ. 37 లక్షలకుపైగా) భారత్‌కు విరాళం ప్రకటించి చేయూతనందించాడు. ఆ తర్వాత.. చాలా మంది అదే బాటలో నడిచారు.
Pat Cummins Tweet: కమిన్స్ డొనేషన్ ప్రకటిస్తూ చేసిన ఆ ట్వీట్ భారత్‌లో.. ట్విట్టర్లో ఈ ఏడాది అత్యధిక రీట్వీట్లు పొందిన పోస్ట్‌గా నిలిచింది. లక్షా 14 వేల మంది కమిన్స్ పోస్ట్‌ను రీట్వీట్ చేయడం విశేషం.
-
.@patcummins30's gesture touched our hearts to become the most Retweeted and Quote Tweeted Tweet of 2021 https://t.co/OTTx0Pmk9X
— Twitter India (@TwitterIndia) December 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@patcummins30's gesture touched our hearts to become the most Retweeted and Quote Tweeted Tweet of 2021 https://t.co/OTTx0Pmk9X
— Twitter India (@TwitterIndia) December 9, 2021.@patcummins30's gesture touched our hearts to become the most Retweeted and Quote Tweeted Tweet of 2021 https://t.co/OTTx0Pmk9X
— Twitter India (@TwitterIndia) December 9, 2021
- తనకు కూతురు జన్మించినట్లు టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అత్యధిక మందికి నచ్చింది. 'మోస్ట్ లైక్డ్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచింది. దీనిని 5 లక్షల 38 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
- వరుసగా రెండో ఏడాది కోహ్లీ ట్వీటే అత్యధిక లైక్స్ పొందింది. గతేడాది విరాట్ తన సతీమణి అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు చేసిన ట్వీట్ 2020లో అత్యధిక లైక్స్ పొందిన ట్వీట్‌గా నిలవడం విశేషం.
- Golden Tweets of 2021: ట్విట్టర్ గోల్డెన్ ట్వీట్స్ ఆఫ్ 2021 ప్రకారం.. Covid19, Farmersprotest, Team India, Tokyo2020, IPL2021, #Master, # Bitcoin హ్యాష్‌ట్యాగ్‌లను ఎక్కువగా ఉపయోగించారు.
2021 జనవరి 1- నవంబర్ 15 మధ్యలో అత్యధిక రీట్వీట్లు, లైక్స్ పొందిన ట్విట్టర్ ఖాతాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించింది ట్విట్టర్.
Twitter Modi News: ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అత్యధిక రీట్వీట్లు, అత్యధిక లైక్స్ ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్‌లకు రావడం విశేషం.
- కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు మోదీ చేసిన ట్వీట్ టాప్ రీట్వీట్గా (225,800) నిలిచింది.
- ఆస్ట్రేలియాపై గబ్బాలో చారిత్రక టెస్టు విజయం సాధించిన టీమ్ ఇండియాను అభినందిస్తూ ప్రధాని చేసిన ట్వీట్ అత్యధిక లైక్స్(2,98,000) పొందింది.
Ratan Tata Tweet: బిజినెస్‌కు సంబంధించి.. 70 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియాను దక్కించుకున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా చేసిన ట్వీట్ అత్యధిక ట్వీట్లు, అత్యధిక లైక్స్ దక్కించుకుంది.
సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసిన.. తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాలో తన ఫస్ట్ లుక్కు సంబంధించి చేసిన ట్వీట్ వినోదరంగానికి సంబంధించి ఎక్కువ లైక్స్, ఎక్కువ రీట్వీట్లు సాధించింది.
క్రీడావిభాగంలో.. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ ఆటను పొగుడుతూ కోహ్లీ చేసిన ట్వీట్‌ను అత్యధిక మంది రీట్వీట్ చేశారు.
గూగుల్ ట్రెండింగ్‌లో ఐపీఎల్..
Google Trending Searches: క్రికెట్ ప్రేమికుల్ని ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2021 ఈ ఏడాది.. గూగుల్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
- ఈ ఏడాది మనదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదం ఇదే.
- దీని తర్వాత స్థానంలో కొవిన్, ఐసీసీ టీ20 ప్రపంచకప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్ 2020, కొవిడ్ వ్యాక్సిన్ నిలిచాయి.
- 2020 సంవత్సరంలో కూడా గూగుల్‌లో అత్యధికంగా వెతికిన పదం ఐపీఎల్ కావడం విశేషం.
ఇదీ చూడండి: గూగుల్ ట్రెండింగ్‌లో ఐపీఎల్ మరో రికార్డు