ఫేస్బుక్, వాట్సాప్‌తో పోటీపడేందుకు ట్విట్టర్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే వాట్స్ప్ స్టేటస్ తరహాలో 'ఫ్లీట్స్'ను అందుబాటులోకి తెచ్చింది ట్విట్టర్. తాజాగా ఆడియోను పోస్టు చేసే ఫీచర్‌ను యూజర్లకు కల్పించింది. 280అక్షరాల సందేశంతో పాటు 140 సెకన్ల వాయిస్‌ను జత చేసే ఫీచర్‌ను రూపొందించింది. ఇది ప్రస్తుతం అమెరికాలోని ఐఓఎస్ యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రాగా.. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది సామాజిక మాధ్యమ దిగ్గజం. అయితే రీట్వీట్, కామెంట్ చేసేందుకు వాయిస్ ఫీచర్ అందుబాటులో లేదు. కేవలం పోస్టు చేసే సమయంలోనే ఇది వినియోగించే వెసులుబాటు ఉంది. ఈ తాజా ఫీచర్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
-
You can Tweet a Tweet. But now you can Tweet your voice!
— Twitter (@Twitter) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Rolling out today on iOS, you can now record and Tweet with audio. pic.twitter.com/jezRmh1dkD
">You can Tweet a Tweet. But now you can Tweet your voice!
— Twitter (@Twitter) June 17, 2020
Rolling out today on iOS, you can now record and Tweet with audio. pic.twitter.com/jezRmh1dkDYou can Tweet a Tweet. But now you can Tweet your voice!
— Twitter (@Twitter) June 17, 2020
Rolling out today on iOS, you can now record and Tweet with audio. pic.twitter.com/jezRmh1dkD
సంప్రదాయ టెక్స్ట్ రూపంలోనే కాకుండా ఇకపై కేవలం వాయిస్ ట్వీట్లు కూడా చేయొచ్చు. ట్విట్టర్ హోమ్‌పేజ్‌లోని ట్వీట్ కంపోజ్ ఆప్షన్‌ను క్లిక్ చేయగానే... అక్కడ వాయిస్ వేవ్‌తో ఉన్న ఓ గుర్తు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే వాయిస్ రికార్డు అవుతుంది. ఆ సమయంలో మీ ఫ్రొఫైల్ ఫొటో కనిపిస్తూ ఉంటుంది. సాధారణ ట్వీట్ల మాదిరిగానే యూజర్లు ఈ వాయిస్ ట్వీట్లనూ రీట్వీట్ చేయవచ్చు, వినవచ్చు, వాటికి టెక్స్ట్ రూపంలో రిప్లై ఇవ్వొచ్చు.
- — Casey Newton (@CaseyNewton) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Casey Newton (@CaseyNewton) June 17, 2020
">— Casey Newton (@CaseyNewton) June 17, 2020
ఆసక్తికరమైన విషయాలు, బ్రేకింగ్ న్యూస్‌లను వాయిస్ ట్వీట్ల ద్వారా షేర్ చేసుకోవచ్చని వెల్లడించింది ట్విట్టర్. అనువాద చిక్కులకు దీనితో చెక్ పెట్టనుంది. తొలుత 140 అక్షరాలతో ట్వీట్ చేసే సదుపాయం ఉండగా... ఆ పరిమితిని తర్వాత 280కి పెంచింది.