డిజిటల్ మీడియా కోసం కేంద్రం రూపొందించిన నియమాలను ట్విట్టర్ పాటించాల్సిందేనని దిల్లీ హైకోర్టు(Delhi High Court) స్పష్టం చేసింది. ట్విట్టర్(Twitter) సంస్థ నిబంధనలు పాటించడం లేదని అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ అంశంపై వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
భిన్నవాదనలు
కాగా, నూతన ఐటీ నిబంధనల(new IT rules)ను పాటిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. స్థానిక ఫిర్యాదు పరిష్కార అధికారిని సైతం నియమించినట్లు న్యాయస్థానానికి వెల్లడించింది.
అయితే ఈ ప్రకటనను కేంద్రం తప్పుబట్టింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్ నడుచుకోవడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది రిపుదమన్ సింగ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ట్వీట్లకు సంబంధించి ఫిర్యాదులు పరిష్కరించేందుకు అధికారిని ఇంతవరకు నియమించలేదని అన్నారు.
రెండు ట్వీట్లకు సంబంధించి ఆ సంస్థకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినట్లు పిటిషనర్ ఆచార్య పేర్కొన్నారు. అప్పుడే ఈ నిబంధనలు పాటించడం లేదన్న విషయం బయటపడిందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు పరిష్కార అధికారిని వెంటనే నియమించేలా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇవీ చదవండి-
New IT rules: కొత్త నిబంధనలతో గూగుల్, ఫేస్బుక్ అప్డేట్!