పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తి పలికే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఈ దిశగా చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. దేశంలోని వ్యాపార వర్గాల్లో విశ్వాసం పెంపొందించే దిశగా 'పన్ను చెల్లింపు చార్టర్'ను పొందుపరుస్తామని వెల్లడించారు.
" వ్యాపార వర్గాల్లో విశ్వాసం పెంపొందించే దిశగా అనుకూల వాతావరణం కల్పించటం, పన్ను విధానంలో మార్పులు చేపట్టనున్నాం. పన్ను చెల్లింపు చార్టర్ను చట్టం పరిధిలోకి తీసుకొస్తామని ఈ బడ్జెట్ ద్వారా భరోసా ఇస్తున్నాం. పన్ను చెల్లింపుదారులపై వేదింపులకు స్వస్తి పలికే దిశగా చర్యలు చేపడతమాని మరోమారు హామీ ఇస్తున్నాం. పన్ను చెల్లింపుదారులపై ఉండే క్రిమినల్ శిక్షల సివిల్ విధానంలో మార్పులకు చర్యలు తీసుకుంటాం. సివిల్ విధానంలో మార్పులకు త్వరలో చట్టసవరణ చేస్తాం. కంపెనీల చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావాలని నిర్ణయించాం. ఇతర చట్టాలను కూడా పరిశీలించి అలాంటి ఏమైన నియమాలు ఉంటే వాటిని సవరిస్తాం."
- నిర్మలా సీతారామన్, విత్త మంత్రి.
ఇదీ చూడండి: రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా 'నిర్మలా' పద్దు