ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇకపై వీధి వ్యాపారులతో కలిసి పని చేయనుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలోని 125 పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మొదటిదశలో సుమారు 36వేల చిన్న సంస్థలకు ప్రధానమంత్రి స్వీయనిధి కింద కేంద్ర పట్టణాభివృద్ధి రుణ సౌకర్యం కల్పించింది.
ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో అహ్మదాబాద్, వారణాశి, చెన్నై, దిల్లీ, ఇండోర్ లాంటి నగరాల్లో 300 మంది వీధి వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందుకు ముందుగా వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ కావడంతో పాటు ఫుడ్ సేఫ్టీలో శిక్షణ పొందిన ధ్రువపత్రం కూడా ఇందుకు సమర్పించాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది.
వినియోగదారులు కోరిన స్ట్రీట్ఫుడ్ను వారి గడప-గడపకు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. వీధి వ్యాపారులను, భోజన ప్రియులను కలపడానికి స్విగ్గీ ఓ వేదిక కానుంది. నాణ్యమైన చిరు తిండిని అందించడానికి కట్టుబడి ఉన్నాం.
- వివేక్ సుందర్, స్విగ్గీ సీఈఓ