నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్.. ఇలా ఓటీటీ వేదికలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు ఉన్న వారికి ఈ స్ట్రీమింగ్ సర్వీసులు చేరువవుతున్నాయి. ఇక లాక్డౌన్ పుణ్యమా అని క్రేజ్ తారస్థాయికి చేరింది. ఆయా ఓటీటీలు ఒకదానితో ఒకటి పోటీపడి మరి ప్రత్యేక కంటెంట్లను అందిస్తున్నాయి. మరి భారత్‌లో ఉన్న ఓటీటీల్లో దేనిని ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు?
ఓటీటీ 'రారాజు'!
18 దేశాల్లో ఓ సర్వే నిర్వహించింది ఫైండర్. ఇందులో భాగంగా.. నెట్‌ఫ్లిక్స్‌ను ఎక్కువ మంది చూస్తున్నారని తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో డిస్నీ ప్లస్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఉన్నాయి.
భారత్‌లోనూ ఓటీటీలకు ఆదరణ పెరుగుతోందని ఈ సర్వేతో స్పష్టమైంది. దేశంలో.. ఓటీటీలను వినియోగించే వారిలో 57శాతం మందికి ఒక్కటి లేదా అంతకుమించిన ఓటీటీ ఖాతాలు ఉన్నాయని తెలిసింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 26శాతం మంది నెట్‌ఫ్లిక్స్ వినియోగిస్తున్నట్టు తెలిపారు. రెండో స్థానంలో 19శాతంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది. మూడో స్థానంలో 17శాతంతో డిస్నీ ప్లస్ ఉంది.
సర్వేలోని మరిన్ని వివరాలు..
- సర్వేలో పాల్గొన్న వారిలో 55.93శాతం మంది మహిళలు. వీరిలో 26.69శాతం మంది నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నట్టు తెలిపారు.
- సర్వేలో పాల్గొన్న 35-44, 45-54 మధ్య వయస్కుల్లోని 25శాతం మంది నెట్‌ఫ్లిక్స్‌కే ఓటు వేశారు.
- 55-64ఏళ్ల వయస్సు వారు మాత్రం డిస్నీ ప్లస్వైపు మొగ్గుచూపారు.
ఇదీ చూడండి:- టిక్‌టాక్, రీల్స్‌కు పోటీగా నెట్‌ఫ్లిక్స్ 'ఫాస్ట్ లాఫ్స్'