ETV Bharat / business

మార్కెట్లకు మళ్లీ నష్టాలే- 52 వేల మార్కు దిగువకు సెన్సెక్స్​

stocks live today
స్టాక్ మార్కెట్లు లైవ్​
author img

By

Published : Feb 17, 2021, 9:23 AM IST

Updated : Feb 17, 2021, 3:55 PM IST

15:50 February 17

మార్కెట్లకు నష్టాలే..

వరుసగా రెండో రోజూ స్టాక్​ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ 400 పాయింట్లు కోల్పోయింది. చివరకు 51 వేల 704 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ 105 పాయింట్లు క్షీణించి.. 15 వేల 209 వద్ద సెషన్​ను ముగించింది.

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతల కారణంగానే.. దేశీయ సూచీలూ నష్టాలను మూటగట్టుకున్నాయి.

లాభనష్టాల్లో..

హీరో మోటోకార్ప్​, అదానీ పోర్ట్స్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ లాభాలను నమోదు చేయగా.. నెస్లే, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఏషియన్​ పెయింట్స్​, మారుతీ సుజుకీ, హెచ్​డీఎఫ్​సీ నష్టాల్లో ముగిశాయి. 

13:33 February 17

15,200 దిగువకు నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ తర్వాత భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా కోల్పోయి 51,600 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల నష్టంతో 15,184 వద్ద ట్రేడవుతోంది.

దాదాపు అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్​ఎంసీజీ, ఆటో షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

  • ఎస్​బీఐ, పవర్​గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టైటాన్​, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • బజాజ్ ఫిన్​సర్వ్​, నెస్లే, మారుతీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​, షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:44 February 17

అమ్మకాల ఒత్తిడి

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 170 పాయింట్లు కోల్పోయి 51,936 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 60 పాయింట్లకుపైగా నష్టంతో 15,249 వద్ద కొనసాగుతోంది.

ఇటీవలి భారీ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ఇండస్​ఇండ్​ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్రా, అల్ట్రాటెక్​ సిమెంట్​, బజాజ్​ ఆటో షేర్ల లాభాల్లో ఉన్నాయి.
  • నెస్లే, ఓఎన్​జీసీ, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

Last Updated : Feb 17, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.