లాభనష్టాల మధ్య ఊగిసలాట..
స్టాక్ మార్కెట్లు లాభానష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సానుకూలంగా ప్రారంభమైన కొద్ది సేపటికే మదుపరుల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 38,841 వద్ద, నిఫ్టీ 11,451 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం సెషన్లో భారీగా కుదేలవ్వడం కూడా దేశీయ సూచీల ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. షాంఘై, సియోల్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.45 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 39.88 డాలర్లకు దిగొచ్చింది.
టైటాన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.