ఒడుదొడుకుల ట్రేడింగ్‌లో శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. బీఎస్ఈ-సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 38,040 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 11,214 వద్ద స్థిరపడింది.
ఇటీవలి లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడగా.. మిడ్ సెషన్ తర్వాత వరకు నష్టాల్లో కొనసాగాయి మార్కెట్లు. చివరి గంటలో తిరిగి కొనుగోళ్లు నమోదు కావడం వల్ల స్వల్ప లాభాలతో వారాంతపు సెషన్‌ను ముగించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 38,110 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,787 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,232 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 11,142 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, ఓఎన్జీసీ లాభాలను గడించాయి.
టైటాన్, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, ఎం&ఎం, ఎల్&టీ షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ఆసియాలో ప్రధాన మార్కెట్లు అయిన సియోల్ సూచీ మినహా షాంఘై, హాంకాంగ్, టోక్యో సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో శుక్రవారం కూడా రూపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.74.93 వద్ద ఉంది.