రికార్డు పరుగులు
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 610 పాయింట్లు బలపడి చరిత్రలో తొలిసారి 52,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 15,315 వద్దకు చేరింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
- యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
- డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.