దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమైనా.. అమ్మకాల ఒత్తిడితో చివరి సెషన్లో ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 10 పెరిగి 11,559 పాయింట్లకు చేరింది.