Stock Market Closing: వారాంతపు సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 12 పాయింట్లు కోల్పోయింది. చివరకు 61 వేల 223 వద్ద స్థిరపడింది.
శుక్రవారం ట్రేడింగ్ తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగింది. సూచీలు ఆరంభంలో భారీ నష్టాల్లో మొదలయ్యాయి. దాదాపు 200 పాయింట్ల నష్టంతో సెషన్‌ను ప్రారంభించిన సెన్సెక్స్.. ఓ దశలో 450 పాయింట్లకుపైగా కోల్పోయింది. 60 వేల 757 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి.. 18 వేల 256 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐటీ, రియాల్టీ రంగాల షేర్లు దూసుకెళ్లాయి. ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలతో నష్టపోయాయి.
ఐఓసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ లాభాలు నమోదుచేశాయి.
ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, హెచ్‌యూఎల్, ఎం అండ్ ఎం నష్టపోయాయి.
ఇవీ చూడండి: Demat Nominee: డీమ్యాట్ ఖాతా నామినీ పేరు రాశారా?