బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ వాహనాల స్టార్టప్.. 'సింపుల్ ఎనర్జీ' తొలి ఈ-స్కూటర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 15న 'సింపుల్ వన్' పేరుతో తమ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఈ కొత్త స్కూటర్ దశల వారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. తొలుత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో.. ఆ తర్వాత ఇతర నగరాల్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫ్రెంచ్ టెక్నాలజీ దిగ్గజం డసో సిస్టమ్స్ ద్వారా తమ స్కూటర్‌ను డిజైన్ చేసినట్లు సింపుల్ ఎనర్జీ తెలిపింది. ఈ స్కూటర్ ధర వివరాలు అధికారికంగా తెలియనప్పటికీ.. రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న ఫ్యాక్టరీలో సింపుల్ వన్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది సింపుల్ ఎనర్జీ. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 50 వేల యూనిట్లు.
-
We are coming this Independence day!!!#IndependenceDay #startup #StartupIndia #electricvehicles #simple #automobile #design #comingsoon #15thaugust #MakeInIndia #madeforyou #Bengaluru #bethechange pic.twitter.com/mP7A1PQ9f6
— Simple Energy (@SimpleEnergyEV) May 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are coming this Independence day!!!#IndependenceDay #startup #StartupIndia #electricvehicles #simple #automobile #design #comingsoon #15thaugust #MakeInIndia #madeforyou #Bengaluru #bethechange pic.twitter.com/mP7A1PQ9f6
— Simple Energy (@SimpleEnergyEV) May 15, 2021We are coming this Independence day!!!#IndependenceDay #startup #StartupIndia #electricvehicles #simple #automobile #design #comingsoon #15thaugust #MakeInIndia #madeforyou #Bengaluru #bethechange pic.twitter.com/mP7A1PQ9f6
— Simple Energy (@SimpleEnergyEV) May 15, 2021
సింపుల్ వన్ ఫీచర్లు..
- ఒక్క సారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించే వీలు
- 0 నుంచి 50 కిలో మీటర్ల వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకునే సామర్థ్యం
- గరిష్ఠ వేగం గంటకు 100 కిలో మీటర్లు
- మిడ్ డ్రైవ్ మోటార్, రిమూవబుల్ బ్యాటరీ
- బ్లూటూత్, నావిగేషన్ కనెక్టివిటీ
ఇదీ చదవండి:జొమాటో ఐపీఓకు సెబీ అనుమతి- త్వరలోనే మార్కెట్లోకి!