ETV Bharat / business

ఆర్థిక షేర్ల అండతో దూసుకెళ్లిన మార్కెట్లు - సెన్సెక్స్

ఆర్థిక షేర్ల అండతో స్టాక్ మార్కెట్లు వారంలో మొదటి రోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11,450 మార్క్ దాటింది. కరెన్సీ మార్కెట్లో రూపాయి 52 పైసలు బలపడింది.

stock market news
నేటి స్టాక్ మార్కెట్​లు
author img

By

Published : Aug 24, 2020, 3:48 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 364 పాయింట్లు బలపడి 38,799 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11,466 వద్దకు చేరింది. ఆర్థిక షేర్ల దన్ను, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు సోమవారం లాభాలకు ప్రధాన కారణం.

బ్యాంకింగ్ షేర్లతో పాటు రిలయన్స్ వంటి హెవీ వెయిట్​ షేర్లు సానుకూలంగా స్పందించడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 38,895 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,546 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,497 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 11,410 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

పవర్​గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎం&ఎం, టైటాన్​, నెస్లే, ఎన్​టీపీసీ షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోలో, హాంకాంగ్ సూచీలూ సోమవారం లాభాలను నమోదు చేశాయి.

రూపాయి యూ టర్న్​..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి సోమవారం యూ టర్న్​ తీసుకుంది. ఒక్క రోజులోనే భారీగా 52 పైసలు బలపడింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 74.32 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:కరోనా కాలంలో క్రెడిట్​ కార్డు వాడాలా వద్దా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.