బ్యాంకింగ్ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 996 పాయింట్లు పుంజుకుని 31,605 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 286 పాయింట్ల వృద్ధితో 9,315 వద్దకు చేరింది.
ఐటీ, వాహన రంగాల్లో సానుకూలతలూ లాభాలకు ఊతమందించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
బుధవారం సెషన్లో సెన్సెక్స్ 31,661 పాయింట్ల అత్యధిక స్థాయి, 30,525 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 9,331 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 9,004 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, మారుతీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం 5 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 75.71 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:వాట్సాప్ ద్వారా వంట గ్యాస్ బుకింగ్ సేవలు