లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.7 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను ప్రతిపాదించవచ్చన్న వార్తలు మదుపరుల సెంటిమెంటును దెబ్బతీశాయి.
ఇంధన, విద్యుత్, వాహన, ఫైనాన్షియల్ రంగాల వాటాలు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడం దీనికి మరింత ఆద్యం పోసింది. బడ్జెట్‌కు ముందు ప్రధాన షేర్లు దిద్దుబాటుకు గురవడం సహజమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 208 పాయింట్లు కోల్పోయి 41 వేల 115 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 12 వేల 106 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, మారుతి, కోటక్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు నష్టపోయాయి.
నెస్లే ఇండియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ రాణించాయి.
ఆసియా మార్కెట్లు
షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ ఒక డాలరుకు రూ.71.22గా ఉంది.
ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.67 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.16 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఫేస్బుక్ 'లిబ్రా' ప్రాజెక్ట్ నుంచి వొడాఫోన్ ఔట్