ETV Bharat / business

దుమ్మురేపిన స్టేట్ బ్యాంక్​- 3 నెలల్లోనే రూ.8,890కోట్ల లాభం - ఎస్బీఐ వార్తలు

ఎస్​బీఐ రెండో త్రైమాసికంలో రూ.8,890 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గడం వల్ల గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభాలు 69శాతం వృద్ధి చెందాయి.

SBI Q2 consolidated profit surges 69 pc to Rs 8,890 cr
రెండో త్రైమాసికంలో ఎస్బీఐకి రూ.8,890కోట్ల నికర లాభం
author img

By

Published : Nov 3, 2021, 2:51 PM IST

Updated : Nov 3, 2021, 3:08 PM IST

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్.. రెండో త్రైమాసికంలో రూ.8,890 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభాలు 69 శాతం వృద్ధి చెందాయి. మొండి బాకాయిలు భారీగా క్షీణించడం సంస్థకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.5,245.88 కోట్లుగా ఉందని ఎస్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

రెండో త్రైమాసికంలో ఎస్​బీఐ గ్రూప్ ఆదాయం రూ.1,01,143కోట్లకు చేరింది. ఇంకా దీన్ని సమీక్షించాల్సి ఉంది. గతేడాది ఇదే సమయంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.95,373కోట్లుగా ఉంది.

సంతంత్ర ప్రాతిపదికన సంస్థ నికర లాభం 4,574.16 కోట్ల నుంచి 67 శాతం పెరిగి రూ.6504 కోట్లకు చేరింది.

స్థూల నిరర్ధక ఆస్తులు గతేడాది ఇదే త్రైమాసికంతో 5.28శాతంగా ఉండగా.. ఈ ఏడాది 4.9శాతానికి తగ్గాయి. మెండి బకాయిలు కూడా 1.59శాతం నుంచి 1.52శాతానికి క్షీచించడం వల్ల బ్యాంకు మెరుగైన ఫలితాలు సాధించింది.

ఇదీ చదవండి: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Last Updated : Nov 3, 2021, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.