హోం లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. గృహ రుణాల వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలకు ప్రారంభ వడ్డీ రేటు 6.70 శాతం ఉంటుందని తెలిపింది. రూ.30 నుంచి 75 లక్షల వరకు ఉన్న లోన్‌లకు వడ్డీ రేటు 6.95 శాతంగా ఉంటుందని వివరించింది.
రూ.75 లక్షలు దాటిన గృహ రుణాలపై వడ్డీ రేటు 7.05 శాతంగా ఉందని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే అదనంగా 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ పొందుతారని ఎస్‌బీఐ వెల్లడించింది.
ఎంతో మేలు...
గృహ రుణ వడ్డీ రేటు తగ్గింపుతో వినియోగదారులకు మేలు జరుగుతుందని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ తగ్గింపు ఈఎంఐ మొత్తాలను గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. మహిళా రుణ గ్రహీతలకు గృహ రుణ వడ్డీ రేట్లపై బ్యాంక్ ప్రత్యేక ఐదు బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తోందని చెప్పారు.
ఇదీ చూడండి: ఎఫ్డీలపై ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా?