ETV Bharat / business

'సామ్​సంగ్' సరికొత్త మడత ఫోన్లు - న్యూ మొబైల్స్

ఫోల్డబుల్​ మొబైల్స్​తో నెటిజన్లను ఆకట్టుకుంటున్న సామ్​సంగ్.. మరిన్ని మడత ఫోన్లు తీసుకురానుంది. ఆగస్టు నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Samsung Galaxy Z Fold 3 and Z Flip 3
సామ్​సంగ్ ఫోల్డ్​ ఫోన్
author img

By

Published : Jul 21, 2021, 9:20 AM IST

సామ్‌సంగ్‌.. ఆగస్టులో మరో మూడు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేయనుంది. వీటి పేర్లు గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిఫ్‌ 3 లైట్‌.

ఫోల్డ్‌ 2 కన్నా గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3 మరింత పలుచగా, తేలికగా ఉంటుందని లీకైన దృశ్యాలు, వివరాలను బట్టి తెలుస్తోంది. మడత పెట్టినప్పుడు దీని మందం 14.5 మి.మీ. ఉంటుంది. కెమెరా బంప్‌తో కలిపితే 15.6 మి.మీ. మందం అవుతుంది. తెరచినప్పుడు కేవలం 6.6 మి.మీ. మందంతోనే కనిపిస్తుంది. కెమెరా బంప్‌తో చూసినా 7.7 మి.మీ. మాత్రమే. సెల్ఫీ కెమెరా కనిపించకపోవటం విశేషం. అంటే పూర్తిగా కనిపించదని కాదు. అంత స్పష్టంగా కనిపించదు. పలుచటి పొర కప్పేసి ఉండటం వల్ల హోల్‌-పంచ్‌ డిజైన్‌ మాదిరిగా కనిపిస్తుంది.

Samsung Galaxy Z Fold 3 and Z Flip 3
గెలాక్సీ జెడ్​ ఫోల్డ్ 3, ఫ్లిప్ 5జీ

ఎస్‌ పెన్‌ సపోర్టు, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఇతర ప్రత్యేకతలు. ఫ్లిప్‌ 3 కన్నా ఫ్లిప్‌ 3 లైట్‌ ధర తక్కువగా ఉండొచ్చు. ఫ్లిప్‌ 3 కవర్‌ డిస్‌ప్లే 1.1 అంగుళాల నుంచి 1.9 అంగుళాల మేరకు పెరిగే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.