ETV Bharat / business

మరింత పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం

author img

By

Published : Nov 12, 2021, 6:21 PM IST

Updated : Nov 12, 2021, 6:50 PM IST

రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్​లో 4.48 శాతానికి (Inflation Rate In India) ఎగబాకింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం భారీగా పెరగడమే ఇందుకు కారణం.

Retail inflation
రిటైల్ ద్రవ్యోల్బణం

అక్టోబర్​​లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) స్వల్పంగా పెరిగింది. గత నెలలో సీపీఐ 4.48 శాతంగా (Inflation Rate In India) నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) శుక్రవారం వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలిపింది.

అంతకు ముందు నెల (సెప్టెంబర్​లో) రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా ఉండగా.. గత ఏడాది అక్టోబర్​​లో ఏకంగా 7.61 శాతంగా నమోదైనట్లు ఎన్​ఎస్​ఓ పేర్కొంది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్​లో 0.85 శాతానికి పెరిగింది. సెప్టెంబర్​లో ఇది 0.68 శాతంగా ఉంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 4.5, నాలుగో త్రైమాసికంలో 5.8గా ఉండోచ్చని అంచనా వేసింది.

పెరిగిన పారిశ్రామికోత్పత్తి..

ఈ ఏడాది సెప్టెంబర్​లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం పెరిగినట్లు కేంద్ర జాతీయ గణాకాల సంస్థ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్​లో కంటే ఇది ఒక శాతం ఎక్కువని పేర్కొంది.

ఇదీ చూడండి: ఆ రోజే స్టాక్​ మార్కెట్లో పేటీఎం షేర్స్​ లిస్టింగ్.. ఆరంభ ధర ఎంతంటే?

Last Updated : Nov 12, 2021, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.