ETV Bharat / business

'బ్లూ హైడ్రోజన్‌ తయారీలో అగ్రస్థానమే లక్ష్యం' - world's largest blue hydrogen maker

Blue hydrogen maker: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బ్లూ హైడ్రోజన్‌ తయారీలో అంతర్జాతీయంగా అతి పెద్ద ఉత్పత్తిదారుగా నిలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. శూన్య ఉద్గార ఇంధనాన్ని అంతర్జాతీయ సరాసరి ధరలో సగానికే అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Reliance aims to be world's largest blue hydrogen maker
'బ్లూ హైడ్రోజన్‌ తయారీలో అగ్రస్థానమే లక్ష్యం'
author img

By

Published : Feb 13, 2022, 6:47 AM IST

Blue hydrogen maker: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బ్లూ హైడ్రోజన్‌ తయారీలో అంతర్జాతీయంగా అతి పెద్ద ఉత్పత్తిదారుగా నిలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. శూన్య ఉద్గార ఇంధనాన్ని అంతర్జాతీయ సరాసరి ధరలో సగానికే అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విభజన ప్రణాళికను వివరిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద చమురు శుద్ధి కాంప్లెక్స్‌ ఆపరేటర్‌ తమ రూ.30,000 కోట్ల ప్లాంట్‌ను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పెట్రోలియం కోక్‌ను సింథసిస్‌ గ్యాస్‌గా మార్చి కిలోగ్రాముకు 1.2-1.5 డాలర్ల బ్లూ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొంది. హైడ్రోజన్‌ అనేది ఇంధనానికి స్వచ్ఛమైన రూపం.

ఉత్పత్తి మెథడాలజీ ప్రకారం, హైడ్రోజన్‌ను గ్రే, బ్లూ, గ్రీన్‌ అని విభజిస్తారు. గ్రే హైడ్రోజన్‌ అనేది చాలా సాధారణ రూపంలో ఉంటుంది. దీన్ని 'స్టీమ్‌ రిఫార్మింగ్‌' ప్రక్రియ ద్వారా సహజ వాయువు లేదా మీథేన్‌ నుంచి ఉత్పత్తి చేస్తారు. బ్లూ హైడ్రోజన్‌ను స్టీమ్‌ మీథేన్‌ రిఫార్మింగ్‌ ద్వారా సహజ వాయువును నుంచి ఉత్పత్తి చేస్తారు. సహజ వాయువును అధిక వేడి ఆవిరి, ఉత్ప్రేరకంతో (కాటలిస్ట్‌) కలిపి బ్లూ హైడ్రోజన్‌ను తీసుకొస్తారు.

గ్రీన్‌ హైడ్రోజన్‌కొస్తే దీన్ని క్లీన్‌ హైడ్రోజన్‌గా పిలుస్తారు. సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించి స్వచ్ఛ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తారు. నీటిని ఎలక్ట్రోలసిస్‌ ప్రక్రియ ద్వారా రెండు హైడ్రోజన్‌ అణువులు, ఒక ఆక్సిజన్‌ అణువుగా మార్చి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేస్తారు.

ఇదీ చూడండి:

భారత్​లో ఇక విద్యుత్​ వాహనాలదే హవా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.