ETV Bharat / business

'సెప్టెంబర్​లో పెరిగిన విమాన ప్రయాణాలు'

author img

By

Published : Oct 5, 2020, 7:24 PM IST

కొవిడ్ తర్వాత నెమ్మదిగా విమానయాన కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్​లో విమాన ప్రయాణికుల సంఖ్య 37-39 శాతం వరకు పెరిగినట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. సెప్టెంబర్​లో రోజుకు సగటున ఒక విమానంలో 98 మంది ప్రయాణం చేసినట్లు తెలిసింది.

Recovery in domestic air passenger traffic
కరోనా నుంచి తేరుకుంటున్న విమాన యాన రంగం

కరోనా​ సంక్షోభం నుంచి విమానయాన రంగం నెమ్మదిగా తేరుకుంటోంది. సెప్టెంబర్​లో విమాన ప్రయాణికుల సంఖ్య ఆగస్టుతో పోలిస్తే 37-39 శాతం పెరిగినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్​తో పోలిస్తే మాత్రం.. ఈ సంఖ్య 60 శాతం తక్కువని వెల్లడించింది.

ఇదే సమయంలో దేశీయ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను 46 శాతం వరకు పెంచాయని ఇక్రా వివరించింది. ఆగస్టులో 33 శాతంగా ఉండటం గమనార్హం.

సడలింపులూ కారణమే..

విమానాల్లో భోజనం, ముందే ప్యాక్ చేసిన చిరుతిళ్లను సర్వ్​ చేసేందుకు ఆగస్టు చివరి వారంలో ప్రభుత్వం అనుమతుల ఇవ్వడం కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు కారణంగా పేర్కొంది ఇక్రా.

లాక్​డౌన్ తర్వాత విమాన సేవలకు అనుమతులు లభించిన మే 25న 416 విమానాలు ప్రయాణాలు సాగించగా.. సెప్టెంబర్ 28న ఈ సంఖ్య 1,488కి పెరిగినట్లు ఇక్రా వివరించింది.

సెప్టెంబర్​లో రోజుకు సగటున 1,311 విమానాలు సేవలందించాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2,874గా ఉండటం గమనార్హం. 2019తో పోలిస్తే రోజవారీ సేవల్లో పాల్గొన్న విమానాలు తగ్గినప్పటికీ.. ఆగస్టు(930)తో పోలిస్తే మాత్రం భారీగా పెరిగినట్లు ఇక్రా పేర్కొంది.

సెప్టెంబర్​లో ఒక విమానంలో సగటున 98 మంది ప్రయాణం చేశారు. 2019లో ఈ సంఖ్య 133గా ఉంది.

ఇదీ చూడండి:లండన్​లో ఓలా క్యాబ్​ సేవలకు బ్రేకులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.