ETV Bharat / business

ఆకాశ ఎయిర్‌.. బోయింగ్‌కు కలిసొచ్చేనా? - బోయింగ్

ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 40 శాతం వాటాతో చౌక ధరల విమానయాన సంస్థను ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఆయన బోయింగ్‌ విమానాలు కొనుగోలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే దేశీయంగా ఆ విమానాల తయారీ సంస్థకు మరో పెద్ద ఖాతాదారు లభించినట్లు అవుతుంది.

boeing
బోయింగ్, ఆకాశ ఎయిర్
author img

By

Published : Aug 8, 2021, 7:27 AM IST

కొత్తగా ఒక ట్రావెల్‌ సంస్థ ప్రారంభించాలనుకుంటేనే బస్సులు ఎక్కడ కొనుగోలు చేయాలి? ఏ సంస్థ బస్సులు మన అవసరాలకు అనుకూలంగా ఉంటాయి? ఇలా పలు అంశాల్ని పరిశీలించి ముందుకు వెళుతుంటారు. అలాంటిది ఏకంగా కొత్త విమానయాన సంస్థను ప్రారంభించాలంటే ఎంత కసరత్తు ఉండాలి? ఏ సంస్థ తయారు చేస్తున్న విమానాలు కొనుగోలు చేయాలి? ఎన్ని కొనుగోలు చేయాలి? ప్రయాణికుల గిరాకీ ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతాయి. తాజాగా ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 40 శాతం వాటాతో చౌక ధరల విమానయాన సంస్థను ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆయన బోయింగ్‌ విమానాలు కొనుగోలు చేస్తారని ప్రచారం సాగుతోంది.

ఇదే నిజమైతే దేశీయంగా ఆ విమానాల తయారీ సంస్థకు మరో పెద్ద ఖాతాదారు లభించినట్లే. భారత్‌లో కొత్తగా చౌక ధరల విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్‌'ను ప్రారంభించడానికి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త సంస్థలో 35 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.260 కోట్లు) మేర ఆయన పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థలో ఆయనకు 40 శాతం వాటా దక్కుతుంది. ఇండిగోలో సుమారు దశాబ్ద కాలం పాటు పని చేసిన ఆదిత్య ఘోష్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ, డెల్టా ఎయిర్‌లైన్స్‌ మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన వినయ్‌ దూబే ఈ సంస్థలో సహ వ్యవస్థాపకులుగా ఉండబోతున్నారు.

4 ఏళ్లలో 70 విమానాలు: విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య దేశీయంగా గణనీయంగా పెరగొచ్చనే అంచనాతో ఆకాశ ఎయిర్‌ కోసం వచ్చే 4 ఏళ్లలో 70 విమానాలు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. 180 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాల కోసం చూస్తున్నట్లు సమాచారం. ఇది విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు కలిసి వచ్చేలా ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి స్పైస్‌జెట్‌ ఒక్కటే విమానాలు కొనుగోలు చేస్తోంది. మిగిలిన విమానయాన సంస్థలైన ఇండిగో, గోఫస్ట్‌, ఎయిరేషియా ఇండియాలు ఎక్కువగా ఎయిర్‌బస్‌ విమానాలనే నడుపుతున్నాయి. స్పైస్‌జెట్‌ బోయింగ్‌తో సహా ఎయిర్‌బస్‌లకు కూడా ఆర్డర్లు ఇస్తోంది.

  • భారతీయ విమానయాన సంస్థలు ప్రస్తుతం 895 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఇందులో 185 బోయింగ్‌ 737 విమానాలు కాగా, 710 ఎయిర్‌బస్‌లున్నాయి. రాకేశ్‌ ప్రారంభించనున్న ఆకాశ ఎయిర్‌ విమానాల కోసం ఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వనుందనేది ఇంకా ప్రకటించకపోయినా, బోయింగ్‌ను సంప్రదించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
  • 2018లో దేశీయ విమానాల్లో 35 శాతంగా ఉన్న బోయింగ్‌ వాటా, జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాల నిలిపివేతతో 18 శాతానికి పడిపోయిందని కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అప్పట్లో నారోబాడీ తరహా విమానాలు 570 తిరిగేవి. ఇందులో బోయింగ్‌ విమానాలే సుమారు 200 ఉండేవి. అవి కాస్తా 100కు తగ్గాయి. ఒకవేళ ఆకాశ ఎయిర్‌ కనుక బోయింగ్‌ ఖాతాదారుగా మారితే ఆ సంస్థ కోల్పోయిన తన వాటాను కొంత వరకైనా తిరిగి దక్కించుకునే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:భారత్​లో భారీ హైబ్రిడ్‌ విద్యుత్తు ప్లాంటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.