ETV Bharat / business

ఆయనకు నెలలోనే రూ.900కోట్ల లాభం.. ఆ రెండు కంపెనీల షేర్లతో...

గత నెల రోజుల్లో స్టాక్ మార్కెట్ల జోరుతో మదుపరులకు లాభాల పంట పండింది. కేవలం రెండు కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా బిగ్​ బుల్​ రాకేశ్​ ఝున్​ఝున్​వాలా దాదాపు రూ.900 కోట్ల లాభాన్ని గడించారు.

Rakesh Jhunjhunwala the Big bul
బిగ్​ బుల్​ (రాకేశ్​ ఝున్​ఝున్​వాలా)
author img

By

Published : Sep 28, 2021, 5:39 PM IST

స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుతో మదుపరుల సంపద రికార్డు స్థాయిలో పెరిగింది. దాదాపు అన్ని రంగాలు భారీగా పుంజుకున్న కారణంగా బీఎస్​ఈ-సెన్సెక్స్​ 60 వేల మార్క్ దాటింది. మంగళవారం సెషన్​లో సూచీలు కాస్త వెనక్కి తగ్గినప్పటికీ.. చాలా కంపెనీల షేర్లు రికార్డు గరిష్ఠాల వద్ద ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ల రికార్డు లాభాలతో గత నెల రోజుల్లో భారీగా లాభాలను గడించిన వారిలో.. బిగ్​ బుల్ రాకేశ్​ ఝున్​ఝున్​వాలా పేరు ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం రెండు కంపెనీల్లో పెట్టుబడుల​ ద్వారా.. నెల రోజుల్లో దాదాపు రూ.900 కోట్ల లాభాన్ని గడించారు.

పంట పండించిన షేర్లు ఇవే..

టాటా మోటార్స్​, టైటాన్​ కంపెనీ షేర్లలో రాకేశ్​ ఝున్​ఝున్​వాలాకు భారీగా పెట్టుబడులున్నాయి. గత నెల రోజుల్లో టాటా మోటార్స్ షేర్లు 13 శాతం పుంజుంకున్నాయి. టైటాన్​ కంపెనీ షేర్లు 11.40 శాతం పెరిగాయి. ఫలితంగా ఈ స్థాయిలో ఝున్​ఝున్​వాలా సంపద పెరిగింది.

టాటా మోటార్స్​లో వాటాలు ఇలా..

ఈ ఏడాది ఏప్రిల్​-జూన్​ త్రైమాసిక డేటా ప్రకారం.. టాటా మోటార్స్​లో 3,77,50,000 షేర్లు బిగ్ బుల్​ పేరు మీద ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో రూ.287.30 వద్ద ఉన్న కంపెనీ షేరు విలువ.. రూ.331 పెరిగింది. అంటే ఒక్కో షేరు రూ.43.70 లాభం తెచ్చి పెట్టింది.

ఈ లెక్కల ప్రకారం.. రాకేశ్​ ఝున్​ఝున్​వాలా ఈ నెలలోనే టాటా మోటార్స్ షేర్ల ద్వారా దాదాపు రూ.165 కోట్ల లాభాన్ని ఆర్జించారు.

టైటాన్​లో వాటాలు వివరాలు..

ఏప్రిల్​-జూన్ త్రైమాసిక గణాంకాల ఆధారంగా టైటాన్​ కంపెనీలో బిగ్​ బుల్ రాకేశ్​ ఝున్​ఝున్​వాలా 3,30,10,395 షేర్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆయన భార్య రేఖా ఝున్​ఝున్​వాలా పేరుమీద 96,40,575 షేర్లున్నట్లు వెల్లడైంది. అంటే టైటాన్​లో మొత్తం 4,26,50,970 షేర్లు ఝున్​ఝున్​వాలా దంపతుల పేరు మీదున్నాయి.

Rakesh Jhunjhunwala with Wife Rekha
భార్య రేఖాతో రాకేశ్​ ఝున్​ఝున్​వాలా

టైటాన్ షేరు విలువ ఈ నెల ఆరంభంలో రూ.1,921.60 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.2092.50కి వద్దకు పెరిగింది. ఒక్కో షేరు రూ.170.90 లాభాన్ని ఇచ్చింది. మొత్తం మీద టైటాన్ షేర్ల వృద్ధితో రాకేశ్​ ఝున్​ఝున్​వాలా రూ.728.90 కోట్లు గడించారు.

రెండు కంపెనీల షేర్ల ద్వారా రాకేశ్​ ఝున్​ఝున్​వాలా సంపద నెల రోజుల్లోనే రూ.893.87 కోట్లు ఎగిసింది.

రాకేశ్​ ఝున్​ఝున్​వాలాకు మొత్తం 38 కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.21,897 కోట్లు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.35వేల కోట్ల పైమాటే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.