ETV Bharat / business

'బిగ్​ బుల్​' కొనగానే ఆ షేర్లు 3.4% జంప్​ - రాకేశ్ ఝున్ ఝున్ వాలా షేర్ల విలువ

స్టాక్ మార్కెట్​ 'బిగ్​ బుల్​' రాకేశ్​ ఝున్​ఝున్​వాలా ఓ సంస్థలో తాజాగా కోటి షేర్లను కొనుగోలు చేశారు. ఈ వార్తలతో స్టాక్ మార్కెట్లో ఆ షేరు విలువ 3.42 శాతం పెరిగింది. ఇంతకీ ఆ కంపెనీ ఏది? అందులో బిగ్​ బుల్ వాటా ఎంత?

Big Bull Rakes Jun Jun Wala
బిగ్​ బుల్​ రాకేశ్ ఝున్​ఝున్​ వాలా
author img

By

Published : Jul 22, 2021, 3:51 PM IST

Updated : Jul 22, 2021, 4:16 PM IST

ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేశ్​ ఝున్​ఝున్​వాలా పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్​లో ఆయన తాజాగా కోటి షేర్లు కొనుగోలు చేశారు. బీఎస్​ఈ డేటా ప్రకారం.. ఇండియా బుల్స్​ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్​లో.. రాకేశ్​ ఝున్​ఝున్​వాలా వాటా 2.17 శాతానికి పెరిగింది.

కోటి షేర్ల కొనుగోలు వార్తలతో.. ఎన్​ఎస్​ఈలో ఇండియా బుల్స్​ హౌసింగ్​ ఫినాన్స్ లిమిటెడ్​ షేరు విలువ 3.42 శాతం (రూ.9.10) పెరిగి.. రూ.275.30 వద్దకు చేరింది. ఈ కంపెనీ షేరు ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పుంజుకుకోవడం గమనార్హం.

కంపెనీ వివరాలు..

ఇండియాబుల్స్​ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్​ దేశంలో ప్రధాన హోంలోన్​ కంపెనీల్లో ఒకటి. ఇది ఇండియా బుల్స్​ గ్రూప్​నకు చెందిన అనుబంధ సంస్థ. చౌక వడ్డీ రేట్లకే రుణాలు ఇచ్చే సంస్థగానూ దీనికి గుర్తింపు ఉంది.

రాకేశ్​ ఝున్​ఝున్​వాలా గురించి..

దేశ స్టాక్ మార్కెట్ గురించి చర్చ వస్తే.. రాకేశ్ ఝున్​ఝున్​వాలా​ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. అంతలా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే.. ఆయన్ను అందరూ 'బిగ్​బుల్​'గా పిలుస్తారు.

మార్కెట్​ డేటా ప్రకారం.. రాకేశ్​ ఝున్​ఝున్​వాలా ఫినాన్స్, టెక్, రిటైల్​, ఫార్మా రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టారు. ట్రెండ్​లైన్​ నివేదిక ప్రకారం.. ఆయనకు మొత్తం 36 స్టాక్స్​లో (కంపెనీలు) దాదాపు రూ.18,867 కోట్లు విలువైన పెట్టుబడులు ఉన్నాయి.

ఇదీ చదవండి:ఈ 6 సూత్రాలతో.. మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి

Last Updated : Jul 22, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.