ETV Bharat / business

'మోదీ... మీ ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయకూడదు?'

author img

By

Published : May 13, 2021, 4:15 PM IST

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్థుడు నీరవ్​ మోదీకి మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టు నోటీసులు పంపించింది. తన ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని తెలిపింది. జూన్​ 11న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Nirav Modi
నీరవ్​ మోదీ

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల(ఎఫ్​ఈఓ) చట్టం ప్రకారం వజ్రాల వ్యాపారి, పీఎన్​బీ కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీ ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని మహారాష్ట్ర ప్రత్యేక కోర్టు ఆయనకు నోటీసులు పంపించింది. జూన్​ 11న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఒక వేళ రాకపోతే ఎఫ్​ఈఓ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లో కుంభకోణాలకు పాల్పడిన నీరవ్​ మోదీని ఆర్థిక నేరస్థునిగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందే నీరవ్​ మోదీ ఇంగ్లాండ్​కు పారిపోయారు. ఆయనను భారత్​కు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి: నీరవ్ మోదీని అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.