ETV Bharat / business

తెలంగాణలో 26 ఏళ్ల గరిష్ఠానికి పెట్రో ధరలు

నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్​ ధరలతో వాహనదారులను బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో గత 26 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేనంత స్థాయికి పెట్రోలు, డీజిల్‌ ధరలు చేరుకున్నాయి.

petrol prices
సరికొత్త గరిష్ఠాలకు పెట్రో ధరలు
author img

By

Published : Jan 24, 2021, 7:51 AM IST

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఏడురోజుల్లో నాలుగోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగాయి. ఈ రెండింటిపైనా లీటరుకు 25 పైసల చొప్పున శనివారం అదనపు వడ్డన పడింది. పన్నులతో కలిపి లీటరు పెట్రోలు ధర దిల్లీలో రూ.85.70, ముంబయిలో రూ.92.28 చొప్పున ఉంది. డీజిల్‌ ధర వరసగా రూ.75.88, రూ.82.66గా ఉంది. మునుపెన్నడూ లేని స్థాయికి పెట్రో ఉత్పత్తుల ధరలు చేరడంతో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించైనా ఉపశమనం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

2018లో పెట్రోలు, డీజిల్‌ బాగా ప్రియమైనప్పుడు కేంద్రం రూ.1.50 చొప్పున సుంకాన్ని, చమురు సంస్థలు లీటరుపై రూపాయి వంతున ధరను తగ్గించుకోవడంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈసారి అలాంటి సంకేతాలేవీ ఇంతవరకు వెలువడలేదు.

గత 26 సంవత్సరాల్లో..

తెలంగాణలో గత 26 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేనంత స్థాయికి పెట్రోలు, డీజిల్‌ ధరలు చేరుకున్నాయి. శనివారం పెట్రోలుపై 26 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.89.15, డీజిల్‌ ధర రూ.82.80లకు చేరుకుంది.

ఇప్పటివరకు 2018 నవంబరులో ఉన్న లీటరు పెట్రోలు ధర రూ.89.06, డీజిల్‌ ధర రూ.82.53లే అత్యధికం. కరోనా నేపథ్యంలో కొంత కాలంగా తగ్గిన చమురు విక్రయాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి తొలి 21 రోజుల్లో 9.65 కోట్ల లీటర్ల పెట్రోలు, 18.73 కోట్ల లీటర్ల డీజిల్‌ విక్రయం జరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెట్రోలు 9.88 శాతం, డీజిల్‌ 6.88 శాతం అధికంగా విక్రయాలు నమోదు కావటం విశేషం.

ఇవీచూడండి: యువ క్రికెటర్లకు బహుమతిగా మహీంద్ర ఖరీదైన కొత్త కార్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.