పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర శనివారం (దిల్లీలో) 59 పైసలు పెరిగి రూ.75.16కు చేరింది. డీజిల్ ధర లీటర్‌కు 58 పైసలు పెరిగి రూ.74.57 గా ఉంది.
గడిచిన ఏడు రోజుల్లో పెట్రోల్ ధర (లీటర్‌పై) రూ.3.9, డీజిల్ ధర (లీటర్‌పై) రూ.4 పెరిగింది.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం 60 పైసల చొప్పున పెరిగాయి.
ప్రధాననగరాల్లో ఇంధన ధరలు (లీటర్‌కు)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.77.89 | రూ.71.78 |
బెంగళూరు | రూ.77.47 | రూ.69.92 |
ముంబయి | రూ.82.24 | రూ.72.18 |
చెన్నై | రూ.79.46 | రూ.72.18 |
కోల్‌కతా | రూ.77.22 | రూ.69.59 |
ఇదీ చూడండి:మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 9.28 శాతం