పెట్రోల్ డీజిల్ ధరలు రానున్న నెలల్లో మళ్లీ భారీగా పెరుగుతాయని(petrol diesel news) ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా తెలిపారు. చమురు విదేశాల నుంచి దిగమతి చేసుకునేదని, అందువల్ల ధరల నియంత్రణ(petrol diesel prices) ప్రభుత్వం చేతుల్లో ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. మనం వినియోగించే మొత్తం ఇంధనంలో 86 శాతాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు. పెట్రోల్, డీజిల్ నియంత్రణ లేని ఉత్పత్తులని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడానికి(petrol diesel price increase) కరోనా సంక్షోభమే కారణమని తనేజా అన్నారు.
" డిమాండ్, సరఫరాలో సమతుల్యత లేనప్పుడల్లా ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధరలు పెరగడానికి ఇది మొదటి కారణం. రెండో కారణం చమురు రంగంలో పెట్టుబడులు లేకపోవడం. ప్రభుత్వాలు సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక(గ్రీన్ ఎనర్జీ) రంగాలను ప్రోత్సహిస్తున్నందు వల్ల ముడి చమురు ధర మరింత పెరిగింది. రానున్న నెలల్లో ఇంకా పెరుగుతుంది. 2023 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.100 పెరవగవచ్చు."
-నరేంద్ర తనేజా.
పెట్రోల్, డిజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి కూడా కారణం చెప్పారు తనేజా. 'చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచుతుంది. చమురు ధరలు బాగా పెరిగినప్పుడు ఈ సుంకాన్ని తగ్గిస్తుంది. కరోనా సమయంలో చమురు వినియోగం, విక్రయం 40శాతం తగ్గింది. ఆ తర్వాత 35 శాతానికి క్షీణించింది. ఇలా జరిగినప్పుడు ప్రభుత్వ ఆదాయం ఆటోమేటిక్‌గా పడిపోతుంది. కానీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వినియోగం కొవిడ్ పూర్వ స్థితికి చేరుకుంది. అందుకే ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. రెండో కారణం.. జీఎస్టీ వసూళ్లు పెరగడం ఆర్థిక వ్యవస్థ రికవరీ అయిందనే సంకేతాన్నిస్తున్నాయి. గతంతో పోల్చితే ప్రభుత్వం మెరుగైన స్థితికి చేరుకుంది. మన ఆర్థిక వ్యవస్థ డీజిల్‌పై ఆధారపడి ఉంది. డీజిల్ ధర పెరిగితే అది అన్ని వస్తువుల ధరలను ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్భణం కూడా ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వం చమురు ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది' అని తనేజా వివరించారు.
పెట్రోల్, డీజిల్ ధరలను(petrol diesel news) జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ప్రజలకు మరింత ఉపమశమనం లభించడమే గాక మరింత పారదర్శకత ఉంటుందని తనేజా అభిప్రాయపడ్డారు.
ప్రజలకు పెట్రోభారం(petrol diesel price increase) నుంచి ఉపశమనం కల్పిస్తూ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని బుధవారం తగ్గించింది కేంద్రం. మూడేళ్ల తర్వాత తొలిసారి పన్నులో కోత విధించింది.
2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పెట్రోల్‌పై నియంత్రణను ఎత్తివేయగా.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం డీజీల్‌పై నియంత్రణను తొలగించింది.
ఇదీ చదవండి: కేంద్రం బాటలో పలు రాష్ట్రాలు- పెట్రో ధరలపై వ్యాట్ తగ్గింపు