పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. మూడు రోజుల విరామం తర్వాత లీటర్ పెట్రోల్ ధర మంగళవారం (దిల్లీలో) 35 పైసలు పెరిగి రూ.87.30 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్ రూ.77.48 వద్ద ఉంది.
ముంబయిలో పెట్రోల్ ధర(లీటర్కు) ఏకంగా రూ.93.83కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.84.36గా ఉంది. ముంబయిలో లీటర్ డీజిల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 25 పైసల నుంచి 30 పైసల వరకు పెరిగాయి. డీజిల్ ధర 24-28 పైసల మధ్య పెరిగింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్కు)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.90.76 | రూ.84.5 |
బెంగళూరు | రూ.90.19 | రూ.82.11 |
ముంబయి | రూ.93.83 | రూ.84.36 |
చెన్నై | రూ.89.68 | రూ.82.64 |
కోల్కతా | రూ.88.61 | రూ.81.05 |
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.