దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర శుక్రవారం 29 పైసలు పెరిగి.. రూ.95.91 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్‌పై 28 పైసలు పెరిగి రూ.86.81 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగునంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.
దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లోనూ పెట్రోల్ ధర లీటర్‌కు 25-30 పైసల మధ్య పెరిగింది. లీటర్ డీజిల్ ధర 27 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్‌కు)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.99.68 | రూ.94.62 |
బెంగళూరు | రూ.99.11 | రూ.92.03 |
ముంబయి | రూ.102.10 | రూ.94.20 |
చెన్నై | రూ.97.24 | రూ.91.47 |
కోల్‌కతా | రూ.95.86 | రూ.89.65 |
ఇదీ చదవండి:ఏటీఎం లావాదేవీలు ఇక మరింత భారం