ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై(Fuel price Today) మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.107.24కు చేరగా.. డీజిల్ ధర రూ.95.98కు పెరిగింది.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర (Mumbai Diesel Price Today) 35 పైసలు పెరిగి రూ.113.08కు చేరగా.. లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.104.00 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ (Kolkata Today Diesel Price) ధర రూ.107.74గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.99.05 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్ (Chennai Diesel Price Today) ధర 35 పైసలు పెరిగి రూ.104.19 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 35 పైసలు రూ.100.22కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ రూ.111.51కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 35 పైసలు అధికమై.. లీటర్ రూ.104.66 కి చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 35 పైసలు పెరిగి.. లీటర్ రూ.113.54కి చేరింది. డీజిల్‌పై 35 పైసలు పెరిగి లీటర్ రూ.106.09 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.27 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.86కి చేరింది.
ఇదీ చూడండి: Phonepe News: యూజర్లకు ఫోన్‌పే షాక్- వాటిపై ఛార్జీలు