ETV Bharat / business

బడ్జెట్‌తో పెట్రో మంట తగ్గనుందా? - బడ్జెట్​ 2021

కరోనా కారణంగా మందగించిన ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వం ముడి చమురుపై పన్నులను పెంచింది. దీంతో ప్రస్తుతం నిత్యావసర వస్తువులుగా మారిపోయిన పెట్రోల్, డీజల్​ ధరలకు రెక్కలు వచ్చాయి. దీనిపై ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగింది. అయితే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెట్రోలియం శాఖ ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీలను తొలగించాలని లేఖ రాసింది.

people are expecting petrol price should be down from the next budget
బడ్జెట్‌తో పెట్రో మంట తగ్గనుందా?
author img

By

Published : Jan 25, 2021, 6:04 AM IST

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొవిడ్‌ సమయంలో పన్నులు పెంచడంతో ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కాకపోతే.. అప్పట్లో ఆదాయవనరులు లేకపోవడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెరవడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. దీంతో ఇప్పటికైనా ఇంధనంపై పన్నులను తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. తాజాగా కొన్ని నగరాల్లో పెట్రోల్‌ ధరలు రూ.90 మార్కును దాటడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

2020లో కరోనా లాక్‌డౌన్‌, ట్రావెల్‌ నిబంధనలు విధించడంతో చాలా చోట్ల చమురుకు డిమాండ్‌ పడిపోయింది. ఫలితంగా ముడిచమురు ధరలు 60 డాలర్ల నుంచి ఏప్రిల్‌లో 19 డాలర్లకు చేరాయి. ఆ తర్వాత మెల్లగా ధరలు పెరుగుతూ వచ్చి జనవరి 22 నాటికి బ్రెంట్‌ ముడిచమురు ధర 55 .37 డాలర్లను తాకింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని లీటర్‌కు రూ.32.98, డీజిల్‌పై రూ.19.98 పెంచారు. గతంలో ఇది పెట్రోల్‌పై 31.83, డీజిల్‌పై15.83గా ఉండేది. ప్రతి లీటర్‌ ఇంధనంపై విధించే ఒక రూపాయి ఎక్సైజ్‌ డ్యూటీతో ప్రభుత్వానికి అదనంగా రూ.14,500 కోట్లు ఆదాయం వస్తుంది.

తాజాగా పెట్రోలియం, సహజవాయువు శాఖ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీలను తొలగించాలని ఇందులో సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో భారత్‌లో అదనపు సుంకాలు విధించారు. ఇప్పుడు వాటిని తగ్గించమని ఇంధన శాఖ కోరింది. ముంబయిలో ఇటీవల పెట్రోల్‌ ధర లీటరు రూ.92.04కు చేరింది.

ఇదీ చూడండి: సీతమ్మా.. రాయితీలివ్వమ్మా: వివిధ రంగాల వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.