బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంచే.. 1938 ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. గత వారం రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలుపగా.. తాజాగా లోక్ సభలోనూ ఆమోద ముద్ర పడింది.
బీమా రంగంలో ప్రస్తుతం 46 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచుతూ ఈ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.
బీమా సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐల పరిమితి పెరిగితే.. బీమా రంగానికి నిధుల కేటాయింపు పెరగటం సహా ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకూ తోడ్పాటు లభిస్తుందని వివరించారు.
ఇదీ చదవండి:అమెజాన్‌తో వివాదంలో 'ఫ్యూచర్'కు ఊరట