ఆన్‌లైన్‌లో రుణాల దరఖాస్తు, క్రెడిట్ స్కోరును తెలుసుకునే సేవలను అందించే పైసాబజార్.కామ్ కొత్తగా ఏర్పాటైన ఎస్‌బీఎమ్ బ్యాంక్ ఇండియాతో కలిసి స్టెప్ అప్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. క్రెడిట్ స్కోరు సరిగా లేకపోవడం వల్ల రుణాలు, క్రెడిట్ కార్డులు రాని వారికి అర్హతను పెంచేందుకు ఈ కార్డును ఆవిష్కరించినట్లు తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ హామీగా ఈ స్టెప్ కార్డును అందిస్తుంది. ఈ కార్డును బాధ్యతతో వినియోగించిన వారికి క్రెడిట్ స్కోరు పెరిగేందుకు తోడ్పడుతుంది.
పూర్తిగా డిజిటల్‌లోనే ఈ కార్డును పైసాబజార్ ప్లాట్‌ఫాంపై పొందే వీలు కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉండటం వల్ల సాధారణ రుణాలను, క్రెడిట్ కార్డులను పొందడం కష్టంగా ఉన్న వారికి ఈ కార్డు వల్ల ప్రయోజనం లభిస్తుందని పైసాబజార్.కామ్ సీఈఓ నవీన్ కుక్రేజా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జియో నయా వార్షిక ప్లాన్‌తో రూ.689 ఆదా