ETV Bharat / business

మోదీ ప్యాకేజీతో పూర్తిగా గట్టెక్కడం కష్టమే: మూడీస్ - విద్యుత్ పంపిణీ సంస్థలు

మోదీ సర్కార్ ప్రకటించిన భారీ ప్యాకేజీ... కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదని మూడీస్ అభిప్రాయపడింది. అయితే ఆర్థిక సంస్థలు నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత మేర ఉపయోగపడుతుందని వెల్లడించింది.

Moody's Investors Service about modi package
మోదీ ప్యాకేజీ కరోనా ప్రభావాన్ని తగ్గించలేదు: మూడీస్
author img

By

Published : May 19, 2020, 1:15 PM IST

మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ... ఆర్థిక సంస్థలు నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత మేర ఉపయోగపడుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అభిప్రాయపడింది. అయితే కరోనా వల్ల ఏర్పడిన ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదని విశ్లేషించింది.

కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​లో భాగం... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎమ్​ఎస్​ఎమ్​ఈ) రూ.3.70 లక్షల కోట్ల మేర ఉద్దీపనలు ప్రకటించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్​బీఎఫ్​సీ) రూ.75,000 కోట్లు, విద్యుత్​ పంపిణీ సంస్థలకు రూ.90,000 కోట్లు కేటాయించింది. కరోనా సంక్షోభాన్ని జయించి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

ఎమ్ఎస్​ఎమ్​ఈ

కరోనా సంక్షోభం కంటే ముందే.. అంటే గత 18 నెలలుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని మూడీస్ గుర్తు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం మరింత ద్రవ్య సమస్యలకు దారితీస్తుందని విశ్లేషించింది.

ఎన్​బీఎఫ్​సీ

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రకటించిన ప్యాకేజీ.... వాటి తక్షణ ఆర్థిక అవసరాల కంటే చాలా తక్కువగా ఉందని మూడీస్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎన్​బీఎఫ్​సీ రంగాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే అవి జారీ చేసిన బాండ్లకు గరిష్ఠంగా రూ.30 వేల కోట్ల మేర ఉద్దీపనలు ప్రకటించింది. ఈ చర్యలు ఈ రంగానికి కాస్త ఉపశమనాన్ని కల్పించినా... పూర్తిగా సమస్యను పరిష్కరించవని తెలిపింది మూడీస్. ఫలితంగా ఎన్​బీఎఫ్​సీల నష్టాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేసింది.

కోలుకునే అవకాశం..

ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు పూచీకత్తులేని రుణాలు అందించడానికి రూ.3 లక్షల కోట్లు కేటాయించడం, రుణాల చెల్లింపు విషయంలో ఏడాది పాటు మారటోరియం విధించడం మంచి పరిణామమని మూడీస్ తెలిపింది. ఫలితంగా ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు ఆర్థిక చేయూత కలుగుతుందని, ఈ రంగానికి రుణాలు అందిస్తున్న బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల ఆస్తి నష్టాలు కూడా తగ్గుతాయని పేర్కొంది.

"కరోనా ప్యాకేజీ ఎన్​బీఎఫ్​సీల మొత్తం రుణాల్లో 2 శాతానికి మాత్రమే సరిపోతాయి. కానీ టాప్ 20 ఎన్​బీఎఫ్​సీల రుణాలే 75 శాతం వరకు ఉంటాయి" అని మూడీస్ తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు ఆర్​బీఐ చేపడుతున్న లిక్విడిటీ చర్యలు కేవలం పెద్ద బ్యాంకింగేతర సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూర్చాయని, చిన్న ఎన్​బీఎఫ్​సీలకు మాత్రం ప్రయోజనం కలిగించలేదని మూడీస్ స్పష్టం చేసింది. కాబట్టి మోదీ ప్యాకేజీ బ్యాంకింగేతర రంగానికి ఏమంత గొప్పగా సహాయపడదని మూడీస్ అభిప్రాయపడింది. వీటికి రుణాలు అందిస్తున్న బ్యాంకింగ్ రంగంలో నష్టాలు కొనసాగుతాయని అభిప్రాయపడింది.

విద్యుత్ పంపిణీ సంస్థలకు..

కరోనా ప్యాకేజీ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కం) తక్షణ ఆర్థిక అవసరాలను తీరుస్తుందని మూడీస్ అంచనా వేసింది. ఈ రంగానికి రుణాలు మంజూరు చేసిన సంస్థలకూ నష్టాలు తగ్గుతాయని పేర్కొంది.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్​ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్​ లిమిటెడ్​కు రాష్ట్ర ప్రభుత్వాల హామీ కారణంగా కొంత ఊరట లభించినప్పటికీ.. కొత్త లిక్విడిటీ క్యాపిటల్​ను అవి పెంచకోకపోతే కొత్త రుణాలు పరపతి తగ్గిపోతుందని మూడీస్ తెలిపింది.

ఇదీ చూడండి: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్​ కీలకాంశాలివే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.