ETV Bharat / business

బ్యాంకింగ్​ వ్యవస్థ ముంగిట 'ఎన్​పీఏ'ల ముప్పు!

author img

By

Published : Jul 7, 2021, 1:13 PM IST

Updated : Jul 7, 2021, 3:57 PM IST

బ్యాంకుల గురించి చర్చ వచ్చినప్పుడు తరచూ వినబడే మాట ఎన్​పీఏలు(Non-performing asset). గతకొన్నేళ్లుగా ఆర్థిక వేత్తల నుంచి సామాన్యుల వరకు వీటి గురించే చర్చిస్తున్నారు. ఇంతకీ ఎన్​పీఏలు అంటే ఏమిటి? స్థూల, నికర ఎన్​పీఏల మధ్య తేడాలు ఏంటి?

NPA
బ్యాంకిగ్ వ్యవస్థ ముంగిట 'ఎన్​పీఏ' ముప్పు.. తీరేదెలా?

దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర కీలకమైంది. ప్రజల నుంచి మొదలుకొని, కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు రోజువారీగా ఆర్థిక కార్యకలాపాల కోసం వీటిపై ఆధారపడుతుంటాయి. బ్యాంకుల గురించి చర్చ వచ్చినప్పుడు కచ్చితంగా వినపడే పదం ఎన్​పీఏ(NPA).

ఎన్​పీఏ అంటే నాన్-పర్ఫార్మింగ్ అసెట్(Non-performing asset). తెలుగులో దీనినే నిరర్థక ఆస్తి అంటారు. సాధారణ వాడుక భాషలో దీనిని మొండి బాకీ (బ్యాడ్ లోన్) అంటారు. ఒక రుణంపై 90 రోజులుగా వడ్డీ లేదా అసలు ఓవర్ డ్యూ ఉన్నట్లయితే దానిని నిరర్థక ఆస్తి అంటారు.

నిరర్థక ఆస్తిని ఇంకా పలు రకాలుగా వర్గీకరించవచ్చు. 90 రోజుల నుంచి 12 నెలల మధ్య వరకు డ్యూ ఉన్నట్లయితే స్టాండర్డ్ అసెట్​గా, అంతకంటే ఎక్కువుంటే డౌట్ ఫుల్ అసెట్, లాస్ అసెట్​గా పరిగణిస్తారు.

స్థూల, నికర ఎన్​పీఏ మధ్య తేడా..

స్థూల, నికర ఎన్​పీఏల మధ్య ప్రొవిజనింగ్ తేడా మాత్రమే ఉంటుంది. రుణ ఖాతాలో ఉన్న అవుట్ స్టాండింగ్ ఎన్​పీఏను స్థూల ఎన్​పీఏ అంటారు. స్థూల ఎన్​పీఏ నుంచి ప్రొవిజనింగ్ మొత్తాన్ని తీసేయగా వచ్చేది నికర ఎన్​పీఏ.

ఇదీ చదవండి: జోరెత్తుతున్న ఎన్​పీఏలు.. ఆర్​బీఐ ముందున్న సవాళ్లు

ప్రొవిజనింగ్..

ఒక రుణాన్ని ఇచ్చినప్పుడు బ్యాంకులు కొంత మొత్తాన్ని పక్కకు పెడుతుంటాయి. దీన్నే ప్రొవిజనింగ్ అంటారు. ఇది రుణం తిరిగి వచ్చే అవకాశాలు, బ్యాంకుల స్థూల మొండీ బాకీలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ రుణ స్వీకర్త రుణం చెల్లించలేకపోయినప్పటికీ బ్యాంకుపై ఎక్కువ ప్రభావం పడకుండా ప్రొవిజనింగ్ మొత్తం ఉపయోగపడుతుంది. వ్యాపారం చేస్తున్న రంగం, రీ పేమెంట్ సామర్థ్యం తదితర విషయాలకు అనుగుణంగా భారతదేశంలో సాధారణంగా ప్రొవిజనింగ్ కోసం బ్యాంకులు 5-20 శాతం కేటాయిస్తున్నాయి.

ఇదీ చదవండి: మొండి బకాయిలుగా విద్యా రుణాలు

ఇదీ చదవండి: మొండిబాకీలతో బ్యాంకులకు బేజారు

రైట్ ఆఫ్..

ఒక బ్యాంకు రూ.కోటి రుణం ఇచ్చిందనుకోండి. 10 శాతం ప్రొవిజన్ చేయాల్సి ఉన్నప్పుడు ఆ మొత్తం రూ.10 లక్షలు అవుతుంది. రుణం తీసుకున్న వారు రూ.50 లక్షలు చెల్లించకపోయినట్లయితే.. ప్రొవిజనింగ్ కోసం కేటాయించిన రూ.10 లక్షలను పరిగణనలోకి తీసుకొని, మిగతా రూ.40 లక్షలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తాయి. దీని వల్ల రూ.10 లక్షలు బ్యాంకు వ్యాపారం కోసం ఉపయోగపడుతాయి.

రైట్ ఆఫ్ వల్ల బ్యాంకుకు రుణాన్ని తిరిగి వసూలు చేసే హక్కు పోదు. అనంతరమూ రుణంపై వచ్చిన ఎలాంటి రికవరీ అయినా బ్యాంకు లాభంగా ఉంటుంది. దీనివల్ల బ్యాలెన్స్ షీట్ గాడిలో పడుతుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 7, 2021, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.