పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే అంశంపై డిసెంబర్ 1 తర్వాత తీర్పు వెలువడనుంది.
ఈ మేరకు నీరవ్ అప్పగింతపై సెప్టెంబర్ 7 నుంచి 11 మధ్య రెండో దశ విచారణ నిర్వహించేందుకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శామ్యూల్ గూజీ అంగీకరించారు. కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ అప్పగింత అంశంపై వచ్చే నెలలో వాదనలు పూర్తి కానున్నాయి.
వీటితో పాటు భారత అధికారులు చేసిన అభ్యర్థనలపైనా విచారణ జరగనుంది. దీని కోసం నవంబర్ 3వ తేదీని నిర్ణయించారు. డిసెంబర్ 1న ఇరుపక్షాలు తమ చివరి అభ్యర్థనలను కోర్టుకు సమర్పించనున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్లో చివరి వాదనలు విన్న తర్వాతే తీర్పు లభించనుంది.
నీరవ్ ఆందోళనలు..
గురువారం జరిగిన వాదనల సందర్భంగా నీరవ్ న్యాయవాది.. భారత్‌లోని తమ సాక్షుల్లో ఒకరిపై రాజకీయ పక్షపాతం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు నమ్మక ద్రోహం అంశంపై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ తిప్సే వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయనపై ఈ ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి