ETV Bharat / business

'ఆ కంపెనీలతోనే లాభాల పంట' - షేర్​ మార్కెట్​ బిగ్‌ బుల్‌

స్టాక్‌ మార్కెట్లో నమోదిత కంపెనీల వాటాల కంటే నమోదు కాని కంపెనీల్లోని వాటాలే తనకు అధిక లాభాలను తెచ్చిపెట్టాయని భారత షేర్​ మార్కెట్​ 'బిగ్ ​బుల్'​ రాకేశ్‌ ఝన్‌ఝున్‌వాలా తెలిపారు. దశాబ్దానికిపై తన వాటాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే షేర్లు కొనుగోలు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

My earnings were more on non listed companies than the listed companies: Jhunjhunwala
'ఆ సంస్థల నుంచే ఎక్కువ ఆర్జించాను'
author img

By

Published : Mar 28, 2021, 8:50 AM IST

స్టాక్‌ మార్కెట్లో నమోదిత కంపెనీల్లో తనకు ఉన్న వాటాల కంటే నమోదు కాని కంపెనీల్లోని వాటాలే అధిక లాభాలను తెచ్చిపెట్టాయని భారత షేర్‌ మార్కెట్‌ 'బిగ్‌ బుల్‌'గా పేరుగాంచిన రాకేశ్‌ ఝన్‌ఝున్‌వాలా తెలిపారు. కొన్ని కంపెనీల్లో 10-12 ఏళ్ల నుంచి తన వాటాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల ఆర్జనపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. 'జన స్మాల్‌ ఫైనాన్స్‌' వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మార్కెట్లు రాణించడానికి కారణాలివే..

భారత్‌ను ఆశ్రిత పెట్టుబడుదారుల దేశంగా అభివర్ణించొద్దని ఝన్‌ఝున్‌వాలా అన్నారు. అసమాన సమాజంగా పిలిచే మన దేశంలో కొత్త ఆశయాలతో వస్తున్న వారే సంపదను సృష్టిస్తున్నారని తెలిపారు. అందుకు ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు. ద్రవ్య లభ్యతే దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు కారణమన్న విశ్లేషణను బిగ్‌ బుల్‌ కొట్టివేశారు. భారత కంపెనీలకు ఆర్జించే సామర్థ్యం ఉందని.. అదే మార్కెట్లను ముందుకు నడుపుతోందన్నారు. రెండు, మూడో త్రైమాసికాల్లో దేశీయ కంపెనీల ఆర్థిక ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. గత సంవత్సరం కాలంలో మార్కెట్లు కొత్త రికార్డులను నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికా సహా ఇతర దేశాల్లో ద్రవ్యలభ్యత కారణంగా దేశీయ మార్కెట్లు కేవలం 10 శాతం మాత్రమే ఎగిసి ఉంటాయన్నారు.

షేర్లు కొనేటప్పుడు వీటికే ప్రాధాన్యం..

ఓ సంస్థ షేర్లను కొనే ముందు.. వ్యాపారానికి ఉన్న వృద్ధి అవకాశాలు, ఆ వ్యాపారాన్ని నడుపుతున్నవారు, కంపెనీ పాలక వ్యవస్థ, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, ఖర్చుల నియంత్రణపై కంపెనీకి ఉన్న నమ్మకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఝన్‌ఝున్‌వాలా సూచించారు. ప్రైవేటు పెట్టబడులకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసి, ఖరీదైన బంగ్లాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నవారు భయపడాల్సిన సమయం వచ్చిందన్నారు.

2025-26 నాటికి రెండంకెల వృద్ధి రేటు..

ప్రతి నాలుగు, ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్‌ సూచీలు రెండింతలవుతాయని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. రానున్న 25 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని.. దేశ తలసరి ఆదాయం చైనాను మించిపోతుందని అంచనా వేశారు. 2025-26 నాటికి దేశ వృద్ధి రేటు రెండంకెలకు చేరుకుంటుందని.. రెండు దశాబ్దాల పాటు అది అలాగే కొనసాగుతుందన్నారు.

ఇదీ చూడండి: 'పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.